తదుపరి వార్తా కథనం

Chandrababu: దిల్లీ పర్యటనలో కేంద్ర ఉక్కు శాఖ మంత్రిని కలిసిన చంద్రబాబు
వ్రాసిన వారు
Jayachandra Akuri
Oct 08, 2024
04:25 pm
ఈ వార్తాకథనం ఏంటి
రెండు రోజుల దిల్లీ పర్యటనలో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు వరుస సమావేశాలతో బీజీగా గడుపుతున్నారు.
ఈ పర్యటనలో ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌లతో ఇప్పటికే కీలక చర్చలు జరిపారు.
ఇప్పుడు ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామిని కూడా కలిశారు.
దిల్లీలోని తన నివాసంలో కేంద్రమంత్రికి సాదర ఆహ్వానం పలికిన చంద్రబాబు, సెయిల్‌లో విశాఖ స్టీల్‌ప్లాంట్ విలీనంపై చర్చలు జరిపారు.