
Chandrababu : సహజ వనరుల దోపిడీకి గత సర్కార్ పాల్పడిందన్న చంద్రబాబు.. ఇవాళ శ్వేతపత్రం విడుదల
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత ఐదేళ్లుగా సహజ వనరుల దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు.
గత ప్రభుత్వం అడవులను ధ్వంసం చేసిందని, సహజ వనరుల దోపిడీపై సచివాలయంలో శ్వేతపత్రం విడుదల చేశారన్నారు.
చంద్రబాబు మాట ప్రకారం భూములు, ఖనిజాలు దోచుకున్నారని తీవ్రంగా ఆరోపించారు. విశాఖపట్నం, ఒంగోలు, చిత్తూరులో ఇళ్ల నిర్మాణాల ముసుగులో భూకబ్జాలకు పాల్పడ్డారని ధ్వజమెత్తారు.
సహజవనరుల దోపిడీపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలకు తావులేకుండా కొత్త వ్యవస్థను తీసుకొచ్చామన్నారు.
వివాదాస్పద ల్యాండ్ టైటిల్ యాక్ట్ ను ముఖ్యమంత్రి తప్పుపట్టారు..జగన్ ప్రభుత్వం చేసిన పొరపాట్లు ఒక్కొక్కటి చక్కదిద్దుతున్నామని వివరించారు.
పర్యావరణాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహరించిన ఏ ఒక్కరినీ ఉపేక్షించబోమని హెచ్చరించారు.రుషి కొండలోని మట్టి దిబ్బలను కనుమరుగు చేశారని చెప్పారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
శ్వేతపత్రం విడుదల చేస్తున్నా సిఎం నారా చంద్రబాబు నాయుడు
Land Grabbing పై శ్వేతపత్రం విడుదల చేస్తున్నా సిఎం నారా చంద్రబాబు నాయుడు గారు ...#AndhraPradesh #NaraChandrababuNaidu pic.twitter.com/uRi4ciNQQB
— Ꮇᴏʜᴀɴ🦁NBK✌️ (@CBNBK6) July 15, 2024