Page Loader
వాలంటీర్లపై చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు 
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు

వాలంటీర్లపై చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు 

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 14, 2023
06:20 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రస్తుతం ఏపీ రాజకీయాలు వాలంటీర్ల చుట్టూ తిరుగుతున్నాయి. కొద్దిరోజుల క్రితం వాలంటీర్లపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీంతో వాలంటీర్లు పవన్ కళ్యాణ్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దీనిపై స్పందించిన పవన్ కళ్యాన్ తాను అందరు వాలంటీర్లను అలా అనలేదని వివరణ ఇచ్చాడు. తాజాగా వాలంటీర్లపై టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్లు ప్రజలకు అవసరమైన ప్రభుత్వ పనులు చేస్తే ఎవరికి సమస్య ఉండదని, అయితే వాలంటీర్లు రాజకీయాలు చేయడం సరికాదని చెప్పారు.

Details

జగన్ ను నమ్ముకొని అధికారులు జైలుకెళ్లారు : చంద్రబాబు నాయుడు

వాలంటీర్లు సైకో చెప్పిన పనులు చేయకూడదని, వాలంటీర్లు అదిస్తాం, ఇదిస్తామంటూ ఇళ్లలోకి వస్తున్నారని, అసలు వీళ్లెవరు ఇంట్లోకి రావడానికి చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. ఇంట్లోకి రావడమే కాకుండా వ్యక్తిగత విషయాలను కనుక్కుంటున్నారని, మీ ఆయనకు వేరే ఎవరితోనైనా సంబంధాలు ఉన్నాయా? అని అడుగుతున్నారని, ఇది కచ్చితంగా కొంపలు కూల్చే వ్యవహారమే అని ఆయన మండిపడ్డారు. సీఎం జగన్‌ను నమ్ముకొని అధికారులు జైలుకు వెళ్లారని, కొందరు అధికారులు గుండెపోటుకు గురైయి ఈ ఉద్యోగాలు వద్దని వెళ్లిపోయారని, టీడీపీ మహిళా నేతల సమావేశంలో చంద్రబాబు అన్నారు.