
Chandra Babu: చంద్రబాబు కీలక నిర్ణయం.. చేనేత, పవర్‌లూమ్ కార్మికులకు ఉచిత విద్యుత్
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం అమరావతిలోని సచివాలయంలో చేనేత, హస్తకళల రంగంపై సమీక్ష నిర్వహించారు.
ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చేనేత కార్మికులు, పవర్‌లూమ్ కార్మికులు, హస్తకళాకారుల సంఖ్యపై సమగ్ర సర్వే నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
త్వరలోనే నూతన టెక్స్‌టైల్స్ పాలసీని తీసుకురావడానికి చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం సూర్యఘర్ పథకం కింద చేనేత మగ్గాలున్న వారికి 200 యూనిట్లు, మర మగ్గాలున్న వారికి 500 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తామని తెలిపారు.
Details
త్వరలో ఆరోగ్య భీమా
చేనేత కార్మికులకు ఆరోగ్య బీమా పథకాన్ని త్వరలో అమలులోకి తెచ్చి, త్రిఫ్ట్ ఫండ్ పథకాన్ని పునరుద్ధరించాలని నిర్ణయించారు.
ఆప్కోలో సిబ్బంది నియామకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు, అలాగే బకాయిల విడుదలకు కూడా ఆమోదం తెలిపారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు మరో కీలక హామీ ఇచ్చారు కేంద్రం జీఎస్టీని రద్దు చేయకపోతే, ఆ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే కార్మికులకు రీయింబర్స్ చేస్తుందని తెలిపారు.
చేనేత ఉత్పత్తుల ఆధునికీకరణ ద్వారా వాటికి డిమాండ్ పెంచే అవకాశం ఉందని, ఈ-కామర్స్ విధానాన్ని అమలులోకి తెచ్చేందుకు అధికారులకు సూచనలు చేశారు.