Chandrababu: సీఎంగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు.. మెగా Dsc ఫైలుపై తోలి సంతకం
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు సచివాలయానికి బయలుదేరి వెళ్లారు. భారీ హోర్డింగ్‌లు, గజమాలలతో ఆయనకు దారిపొడవునా కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. నినాదాలతో హోరెత్తించారు. సీఎం మార్గమధ్యలో తన కాన్వాయ్‌ని ఆపి వారితో మాట్లాడారు. చంద్రబాబు సరిగ్గా సా.4.41 నిమిషాలకు సచివాలయం మొదటిబ్లాక్‌లోని తన ఛాంబర్‌లో వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక పూజలు చేసి బాధ్యతలు చేపట్టారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు మెగా డీఎస్సీ ఫైల్ పై సీఎం మొదటి సంతకం చేశారు. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్టు రద్దు ఫైల్‌పై రెండో సంతకం, సామాజిక పింఛన్లు రూ.4వేలకు పెంపు దస్త్రంపై మూడో సంతకం, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణపై నాలుగు, నైపుణ్య గణనపై ఐదో సంతకం చేశారు.