Page Loader
భారత అంతరిక్షానికే చంద్రయాన్‌-3 మైలురాయి.. ఇస్రో సైంటిస్టులకు గుడ్‌లక్‌ చెప్పిన మోదీ  
భారత అంతరిక్షానికే చంద్రయాన్‌-3 మైలురాయి.. ఇస్రో సైంటిస్టులకు ప్రధాని మోదీ ధన్యవాదాలు

భారత అంతరిక్షానికే చంద్రయాన్‌-3 మైలురాయి.. ఇస్రో సైంటిస్టులకు గుడ్‌లక్‌ చెప్పిన మోదీ  

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Jul 14, 2023
02:19 pm

ఈ వార్తాకథనం ఏంటి

చందమామ గురించి శోధించే క్రమంలో అగ్రరాజ్యాలు ఇప్పటికే చంద్రుడి మీద జెండాలు పాతాయి. అయినప్పటికీ చంద్రుడికి సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకోలేకపోయాయి. జాబిల్లిపై పరిశోధనలను భారతదేశం ఆలస్యంగానే ప్రారంభించింది. కానీ ఎవరూ అడుగుపెట్టని దక్షిణదిశను తాకాలన్న లక్ష్యం మేరకు ఇస్రో మరోసారి రెఢీ అయ్యింది. ఈ నేపథ్యంలోనే మూడో చంద్ర మిషన్ చంద్రయాన్‌-3 మిషన్‌ను సిద్ధం చేసింది. శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) రెండో ప్రయోగ వేదిక నుంచి మధ్యాహ్నం 2.35 గంటలకు ఎల్‌వీఎం3-ఎం4 ఉపగ్రహ వాహక నౌకను ప్రయోగించనున్నారు. ఈ మిషన్‌ విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ట్వీట్‌ చేశారు. భారతదేశం అంతరిక్ష రంగానికి సంబంధించి జులై 14 2023ని చరిత్రలో నిలిచిపోనుందన్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

చంద్రయాన్‌-3కి గుడ్‌లక్‌ చెప్పిన మోదీ