Video: చైనా సైనికులను ఎదురుకొన్న లడఖ్ గొర్రెల కాపరులు
లడఖ్‌లోని గొర్రెల కాపరుల బృందం భారత్-చైనా సరిహద్దు సమీపంలో గొర్రెలను మేపుతున్న స్థానికులను ఆపడానికి ప్రయత్నించినప్పుడు చైనా సైన్యానికి ఎదురొడ్డి నిలబడిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. 2020 గాల్వాన్ ఘర్షణ తర్వాత ఈ ప్రాంతంలో జంతువులను మేపడం మానేసిన గొర్రెల కాపరులు ఇప్పుడు ఆ ప్రాంతానికి తిరిగి వచ్చారు. కానీ,చైనా సైన్యం వారిని అడ్డుకుంది.అవాక్కయిన స్థానికులు పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (PLA) సభ్యులను ప్రశ్నించారు. మన సైన్యం సాయంతో అక్కడి నుంచి చైనా సేనలను వెనక్కి పంపించారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వీడియోను చుషుల్ కౌన్సిలర్ కొంచోక్ స్టాంజిన్ తన X ఖాతలో షేర్ చేశారు.