Page Loader
వరద గుప్పిట్లో దిల్లీ.. వరద ప్రాంతాల్లో 11.30 గంటలకు సీఎం కేజ్రీవాల్ పర్యటన
వరద గుప్పిట్లో దిల్లీ

వరద గుప్పిట్లో దిల్లీ.. వరద ప్రాంతాల్లో 11.30 గంటలకు సీఎం కేజ్రీవాల్ పర్యటన

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Jul 13, 2023
10:53 am

ఈ వార్తాకథనం ఏంటి

దిల్లీ మహానగరం వరద గుప్పిట్లో ఉండిపోయింది. గత కొద్ది రోజులుగా ఉత్తరాదిలో కురుస్తున్న భారీ వర్షాలకు దిల్లీ, హర్యానా రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి. ఈ మేరకు గురువారం ఉదయం 7 గంటలకు యమునా నదిలో 208.46 మీటర్ల మేర వరద ప్రవాహం కొనసాగుతోంది. హర్యానాలోని హత్నికుండ్‌ బ్యారేజీ నుంచి నీటి విడుదల కొనసాగుతోంది. వరద ముప్పు మరింత పొంచి ఉందని కేంద్ర జల సంఘం హెచ్చరించింది. 1978లో యమునా 207.49 మీటర్ల మేర ప్రవహించింది. తాజా వరదలతో 45 ఏళ్ల రికార్డు బద్దలైపోయింది. రానున్న 5, 6 రోజులు దిల్లీలో మోస్తరు వర్షాలు కురవనున్నట్లు ఐఎండీ వెల్లడించింది. 208.46 మీటర్లతో ప్రమాద హెచ్చరికల కంటే 3 మీటర్లు అధిక ఎత్తులో యమునా ప్రవహిస్తోంది.

details

ఇప్పటికే 16500 మంది సురక్షిత ప్రాంతాలకు తరలింపు

మరోవైపు వరదలతో లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న దాదాపు 16,500 మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సిటీలోని లోతట్టు ప్రాంతాలన్నీ నీటమునిగాయి. మఠం మార్కెట్ ప్రాంతాలు, యమునా బజార్, గర్హి మందు, గీతాఘాట్, విశ్వకర్మ కాలనీ, ఖద్దా కాలనీ, పాత రైల్వే బ్రిడ్జి సమీపంలోని నీలి ఛత్రి దేవాలయం పరిసరాలు, నీమ్ కరోలి గౌశాల, వజీరాబాద్ నుంచి మజ్ను కతిలా వరకు రింగ్‌ రోడ్‌లోని పలు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. దేశ రాజధానిలో తాగునీటిని సరఫరా చేసే వజీరాబాద్ వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ మూసేశారు. సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఉదయం 11:30 గంటలకు ఆయా ప్రాంతాల్లో పర్యటించనున్నారు.

details

పాఠశాలలు బంద్, శ్మాశాన వాటిక సైతం నిలుపుదల

యమునా నదికి సమీపంలో ఉన్న గీతా కాలనీ శ్మశానవాటికను సైతం మూసివేశారు. దానికి బదులుగా ఘాజీపూర్ శ్మశాన వాటికను దహన సంస్కారాలకు ఉపయోగించాలని దిల్లీ బల్దియా సూచించింది. వరదల కారణంగా సివిల్ లైన్స్ జోన్‌లోని లోతట్టు ప్రాంతాల్లో ఉన్న 10 పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఆయా పాఠశాలల విద్యార్థులకు ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి హర్యానా బ్యారేజీ ప్రవాహం తగ్గిపోనుందని అంచనా వేశారు. మరోవైపు ఎగువన ఉత్తరాఖండ్‌లో రానున్న రెండు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నట్లు ఐఎండీ అంచనా వేసింది. దింతో వరదలను మరింత పెంచుతుందని అధికారులు భావిస్తున్నారు.

embed

వరద గుప్పిట్లో దిల్లీ 

#WATCH | Civil Lines area of Delhi flooded, latest visuals from the area. Several areas of the city are reeling under flood and water-logging as the water level of river Yamuna continues to rise following heavy rainfall and the release of water from Hathnikund Barrage. pic.twitter.com/UecZsfIBwb— ANI (@ANI) July 13, 2023

ట్విట్టర్ పోస్ట్ చేయండి

దిల్లీ కశ్మీరి గేట్ వద్ద వరద

ట్విట్టర్ పోస్ట్ చేయండి

రోడ్డుకు సమాంతరంగా వరద నీరు