Andhrapradesh: అమరావతి రైతులకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుభవార్త
ఈ వార్తాకథనం ఏంటి
సంక్రాంతి పండుగ సందర్భంగా అమరావతి కౌలు రైతులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుభవార్త చెప్పారు.
గత ప్రభుత్వం పెండింగ్‌లో ఉంచిన కౌలు డబ్బులను కూటమి ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేసింది.
రాజధాని అమరావతిని విధ్వంసం చేయడమే కాకుండా, మూడు రాజధానుల ప్రతిపాదనతో జగన్ ప్రభుత్వం రాజధాని రైతులపై కక్ష్య సాధింపు చర్యలకు దిగింది.
రైతులు మాస్టర్ ప్లాన్‌కు విరుద్ధంగా ఏర్పాటైన ఆర్-5 జోన్‌ను వ్యతిరేకించారు.
అమరావతిలో భూమిలేని వారికి నివాస స్థలాలు ఇచ్చే ప్రణాళికను సుప్రీంకోర్టు వ్యతిరేకించడంతో, జగన్ ప్రభుత్వం రైతుల కౌలు చెల్లింపులను నిలిపివేసింది.
రైతులు హైకోర్టులో పిటిషన్లు వేసినప్పటికీ, అవి పెండింగ్‌లో ఉన్నాయి.
వివరాలు
రూ. 255 కోట్లు రైతుల ఖాతాల్లో..
ఈ నేపథ్యంలో జరిగిన ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో, సీఎం చంద్రబాబు రైతుల బకాయిలను చెల్లించడంతో పాటు, రాజధాని నిర్మాణాన్ని పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు.
అధికారంలోకి వచ్చిన తర్వాత, రెండు నెలల కిందట 9వ సంవత్సరానికి సంబంధించిన కౌలు చెల్లింపులు చేశారు.
సంక్రాంతి పండుగ సందర్భంగా 10వ సంవత్సరానికి సంబంధించిన రూ. 255 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశారు.
అంతేకాకుండా, రాజధానిలో భూమిలేని నిరుపేదలకు నెలవారీ పెన్షన్లను కూడా చెల్లించారు, దీనితో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.
వివరాలు
మూడేళ్లలో రాజధాని నిర్మాణం
ఎన్నికల ముందు కూటమి తరఫున టీడీపీ,జనసేన,బీజేపీ పార్టీలు ఏకైక రాజధాని అమరావతేనని హామీ ఇచ్చాయి.
తిరిగి నిర్మాణాలను ప్రారంభించేందుకు టెండర్లు పిలిచారు. ప్రపంచ బ్యాంకు, హడ్కో, జర్మనీకి చెందిన కేఎఫ్‌డబ్ల్యూ బ్యాంకులు కలిసి మొత్తం రూ. 31వేల కోట్ల రుణం మంజూరు చేశాయి.
ఈ రుణంతో అసంపూర్తిగా ఉన్న భవనాలు, సచివాలయం టవర్లు, అసెంబ్లీ, హైకోర్టు, మంత్రులు, జడ్జీలు ఇతర భవనాల నిర్మాణాలను ప్రారంభించనున్నారు.
సీడ్ యాక్సెస్ రోడ్లు, అంతర్గత రహదారులు, రైతుల ప్లాట్లలో మౌలిక సదుపాయాలను కల్పించనున్నారు.
వీటి కోసం సీఆర్డీయే టెండర్లు పిలిచింది. రాజధాని రైతులకు మరో ఐదేళ్ల కౌలు చెల్లింపులను చేపట్టేందుకు సీఎం చంద్రబాబు అంగీకరించారు.
రాబోయే మూడేళ్లలో రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేస్తామని ప్రభుత్వం తెలిపింది.