Page Loader
Handri-Neeva: హంద్రీనీవా ఫేజ్-1 ద్వారా జీడిపల్లి రిజర్వాయర్ కు నీళ్లు విడుదల చేసిన సీఎం చంద్రబాబు 
హంద్రీనీవా ఫేజ్-1 ద్వారా జీడిపల్లి రిజర్వాయర్ కు నీళ్లు విడుదల చేసిన సీఎం చంద్రబాబు

Handri-Neeva: హంద్రీనీవా ఫేజ్-1 ద్వారా జీడిపల్లి రిజర్వాయర్ కు నీళ్లు విడుదల చేసిన సీఎం చంద్రబాబు 

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 17, 2025
02:23 pm

ఈ వార్తాకథనం ఏంటి

హంద్రీనీవా ఫేజ్-1 కాల్వల విస్తరణ పనులు పూర్తి కావడంతో, గురువారం నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నీటిని విడుదల చేశారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం మల్యాల పంపింగ్‌ స్టేషన్‌లో జలహారతి ఇచ్చి,రెండు మోటార్లను స్వయంగా ఆన్‌ చేశారు. ఈ నీటి విడుదలతో రాయలసీమ ప్రాంతానికి తాగునీరు,సాగునీటి అవసరాలు తీరనున్నాయి. 12 ఏళ్ల విరామం తర్వాత సీమ ప్రాంతానికి 40 టీఎంసీల నీరు అందుబాటులోకి వచ్చింది.

వివరాలు 

ఛాయాచిత్ర ప్రదర్శనను సందర్శించిన  ముఖ్యమంత్రి 

ఈ సందర్భంగా జలవనరులశాఖ ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శనను ముఖ్యమంత్రి సందర్శించారు. ప్రాజెక్ట్‌ అలైన్‌మెంట్‌, ఆయకట్టు ప్రాంత వివరాలు, కృష్ణా నది పరివాహక ప్రాంత మ్యాప్‌లను సమీక్షించారు. అలాగే మల్యాల పంపింగ్‌ స్టేషన్‌ వ్యూపాయింట్‌ నుండి నీటి విడుదలను ప్రత్యక్షంగా వీక్షించారు. కార్యక్రమంలో నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌, ఎంపీ బైరెడ్డి శబరి, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

హంద్రీనీవా ఫేజ్-1 ద్వారా జీడిపల్లి రిజర్వాయర్ కు నీళ్లు విడుదల చేసిన ముఖ్యమంత్రి