CM Chandrababu: మిర్చి యార్డ్ సమస్యలపై సీఎం చంద్రబాబు ప్రత్యేక సమావేశం
ఈ వార్తాకథనం ఏంటి
మిర్చి ధరలు భారీగా పడిపోవడంతో రైతులు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నారు.
ఈ సమస్యకు రాజకీయ రంగు కూడా పులమడంతో పాలక, ప్రతిపక్ష నాయకుల ఎంట్రీ మరింత హాట్ టాపిక్‌గా మారింది.
ఇప్పటికే మిర్చి రైతుల దుస్థితిని కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రేపు మిర్చి యార్డ్ అధికారులతో, ట్రేడర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు.
ఈ ఏడాది మిర్చి ధరల పతనంపై చర్చించి, అవసరమైన చర్యలను చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది.
Details
గిట్టుబాటు ధర అందించేలా చర్యలు
ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 5 లక్షల ఎకరాల్లో మిర్చి సాగు జరిగింది. మొత్తం 12 లక్షల మెట్రిక్ టన్నుల మిర్చి పండగా, ఇప్పటివరకు 4 లక్షల మెట్రిక్ టన్నుల మిర్చిని వ్యాపారులు కొనుగోలు చేశారు.
మిగిలిన 8 లక్షల మెట్రిక్ టన్నుల పంటకు గిట్టుబాటు ధర అందించేలా ప్రభుత్వం చొరవ చూపనుంది.
రాజకీయంగా మారుతున్న మిర్చి ధరల వివాదం
ఎప్పుడూ లేనంతగా మిర్చి ధరలు పడిపోవడం రైతులను ఆందోళనలో ముంచేసింది. దీనిపై రాజకీయ విమర్శలు కూడా ఊపందుకున్నాయి.
రైతుల నుంచి విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్న తరుణంలో ప్రభుత్వం రంగంలోకి దిగింది. రేపు ప్రభుత్వం వ్యాపారులు, మార్కెట్ కమిటీ ప్రతినిధులతో సమావేశమై ధరల పతనానికి గల అసలైన కారణాలను విశ్లేషించనుంది.
Details
రైతుల్లో ఉత్కంఠ
రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపై మిర్చి రైతుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
గిట్టుబాటు ధర కల్పించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.
వ్యవసాయ రంగానికి మద్దతుగా, రైతులకు న్యాయం చేయాలని ఏపీ రైతులు పెద్ద ఎత్తున కోరుతున్నారు.