Revanth Reddy Meets PM Modi: ప్రధాని మోదీతో సీఎం రేవంత్ భేటీ.. రాష్ట్ర సమస్యలపై కీలక చర్చ!
వ్రాసిన వారు
Jayachandra Akuri
Nov 15, 2026
12:54 pm
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. మంత్రులు ఉత్తమ్, వాకిటి శ్రీహరితో కలిసి ప్రధానిని కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలను మోదీ దృష్టికి తీసుకెళ్లారు.
వివరాలు
ఎల్‌నినో ప్రభావంతో కరవు పరిస్థితులు
ఎల్‌నినో ప్రభావం కారణంగా తెలంగాణలో ఏర్పడిన కరవు పరిస్థితులను సీఎం రేవంత్‌రెడ్డి ప్రధానికి వివరించారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులు కేటాయించాలని కోరారు.
తెలంగాణ సదస్సులు, ఖేలో ఇండియాకు ఆహ్వానం
తెలంగాణలో నిర్వహించనున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సుతో పాటు ఖేలో ఇండియా పోటీల ప్రారంభోత్సవానికి హాజరుకావాలని ప్రధాని నరేంద్రమోదీని రేవంత్‌రెడ్డి ఆహ్వానించారు.