Revanth Reddy: గోల్కొండ కోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చారిత్రక గోల్కొండ కోటకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. సీఎం హోదాలో ఆయన తొలిసారి జాతీయ జెండాను ఎగురవేశారు. అంతకుముందు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో సైనిక అమరవీరుల స్తూపం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి సీఎం రేవంత్‌రెడ్డి నివాళులు అర్పించారు. ఇక అక్కడి నుంచి నేరుగా గోల్కొండ కోటకు చేరుకున్నారు. స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలను వీక్షించారు. అనంతరం రాష్ట్ర ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి సీఎస్, మంత్రులు, ముఖ్య నేతలు హాజరయ్యారు.