Page Loader
Revanth Reddy: గ్రూప్-1 అభ్యర్థులకు సీఎం రేవంత్‌ శుభాకాంక్షలు.. ఎటువంటి ఆందోళన లేకుండా పరీక్షలు రాయండి
గ్రూప్-1 అభ్యర్థులకు సీఎం రేవంత్‌ శుభాకాంక్షలు.. ఎటువంటి ఆందోళన లేకుండా పరీక్షలు రాయండి

Revanth Reddy: గ్రూప్-1 అభ్యర్థులకు సీఎం రేవంత్‌ శుభాకాంక్షలు.. ఎటువంటి ఆందోళన లేకుండా పరీక్షలు రాయండి

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 21, 2024
02:16 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలకు హాజరవుతున్న అభ్యర్థులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అభ్యర్థులు తమ లక్ష్యాలపై పూర్తిగా దృష్టి పెట్టి పరీక్షలు రాయాలని ఎక్స్‌ ప్లాట్‌ఫామ్‌లో ఆయన పోస్ట్‌ చేశారు. గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలకు హాజరయ్యే ప్రతి అభ్యర్థికి తన శుభాకాంక్షలని, ఆందోళన లేకుండా, పూర్తి ఏకాగ్రతతో పరీక్షలు రాయాలని పిలుపు నిచ్చారు. మీ విజయం తెలంగాణ పునర్నిర్మాణంలో కీలక పాత్ర పోషించే దిశగా మారాలని కోరుకుంటున్నానని ముఖ్యమంత్రి తెలిపారు. అభ్యర్థులు ఈ పరీక్షల్లో విజయం సాధించి, రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నట్లు సీఎం చెప్పారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

సీఎం రేవంత్ రెడ్డి చేసిన ట్వీట్