
Andhra Pradesh: ఏపీ విద్యార్థులకు సీఎం బంపర్ ఆఫర్.. విదేశాల్లో చదువుకోవాలనే విద్యార్థులకు రూ.25 లక్షలు
ఈ వార్తాకథనం ఏంటి
విదేశాల్లో ఉన్నత విద్యలో చదువుకోవాలనుకునే ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థుల కలలకు ఊతమిచ్చే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెద్ద అడుగు వేస్తోంది.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాజాగా ప్రకటించిన విదేశీ విద్య పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ, కాపు వర్గాల్లోని ప్రతిభావంతులైన పేదల విద్యార్థులకు విదేశాల్లో పీజీ, పీహెచ్‌డీ, ఎంబీబీఎస్ కోర్సుల్లో చదివేందుకు ఆర్థిక సాయం అందించనున్నారు.
ఈ పథకాన్ని 'అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి'గా గుర్తిస్తూ అధికారులు ఇప్పటికే మార్గదర్శక ముసాయిదాను సిద్ధం చేసి ప్రభుత్వానికి సమర్పించారు.
Details
ప్రతిపాదనలు ఎలా ఉన్నాయంటే
ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రూ.25 లక్షలతో పాటు అదనంగా నిర్వహణ ఖర్చుల కింద రూ.5 లక్షలు
బీసీ, మైనారిటీ వర్గాలకు రూ.20 లక్షలు
ఈబీసీ, కాపు వర్గాలకు రూ.15 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నారు.
ఈ పథకం 2014-19 మధ్యలో టీడీపీ ప్రభుత్వం కాలంలో అంబేడ్కర్, ఎన్టీఆర్ పేర్లతో విజయవంతంగా అమలయ్యింది.
Details
విద్యార్థులకు లబ్ధి చేకూరే అవకాశం
అయితే వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఈ పథకాన్ని జగనన్న విదేశీ విద్య పథకంగా మలచి, కఠిన నిబంధనలు విధించింది.
ముఖ్యంగా కేవలం క్యూఎస్ ర్యాంకింగ్‌లో టాప్-50 వర్సిటీల్లో ప్రవేశం పొందినవారికే లభించేలా చేసిన ఈ నిబంధనల వల్ల చాలా మంది విద్యార్థులు అర్హత కోల్పోయారు.
ఇప్పుడిక తాజా మార్గదర్శకాల్లో మార్పులు చేసి, క్యూఎస్ ర్యాంకింగ్ టాప్-250 వర్సిటీల్లో ప్రవేశం పొందిన విద్యార్థులకూ ఆర్థిక సాయం అందేలా ప్రతిపాదనలు రూపొందించారు.
దీని వల్ల విస్తృతంగా విద్యార్థులకు లబ్ధి చేకూరే అవకాశం ఉంది.