LOADING...
Mid-air scare: ముంబయి వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానంలో బొద్దింకలు.. స్పందించిన విమాన సంస్థ  
ముంబయి వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానంలో బొద్దింకలు.. స్పందించిన విమాన సంస్థ

Mid-air scare: ముంబయి వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానంలో బొద్దింకలు.. స్పందించిన విమాన సంస్థ  

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 04, 2025
01:12 pm

ఈ వార్తాకథనం ఏంటి

సాన్ ఫ్రాన్సిస్కో నుంచి ముంబైకి కోల్‌కతా ద్వారా వెళ్లుతున్న ఎయిర్ ఇండియా విమానం (AI180)లో బొద్దింకలు కనిపించడంతో ఇద్దరు ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.‌ విమానంలో కొన్ని చిన్న బొద్దింకలు కనిపించటంతో ఇద్దరు ప్రయాణికులు భయభ్రాంతులకు లోనయ్యారు. వెంటనే దీనిపై స్పందించిన కేబిన్ సిబ్బంది వారిని అదే కేబిన్‌లోని ఇతర సీట్లకు మార్చి కూర్చోబెట్టారు. ఆ తర్వాత వారు సౌకర్యంగా ప్రయాణం కొనసాగించారు.

వివరాలు 

గ్రౌండ్ సిబ్బందితో క్లీనింగ్

ఈ ఘటనపై స్పందించిన ఎయిర్ ఇండియా సంస్థ... ''AI180 విమానం కోల్కతాలో ఫ్యూయల్ స్టాప్ కోసం ల్యాండ్ అయిన వెంటనే, మేము గ్రౌండ్ సిబ్బందితో క్లీనింగ్ పని చేయించాం. లోతైన శుభ్రత చర్యలు చేపట్టాం. అనంతరం అదే విమానం ముంబయికి సమయానికి బయలుదేరింది. మేము క్రమం తప్పకుండా ఫ్యూమిగేషన్ చేస్తుంటాం. అయినప్పటికీ, గ్రౌండ్ ఆపరేషన్ల సమయంలో అప్పుడప్పుడూ ఈగలు,బొద్దింకలు వంటివి లోపలికి ప్రవేశిస్తున్నాయి,'' అని తెలిపారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ముంబయి వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానంలో బొద్దింకలు