
Varanasi: రాజకీయాలలోకి కమెడియన్ శ్యామ్ రంగీలా .. వారణాసి నుంచి ప్రధాని మోదీపై ఎన్నికల్లో పోటీ
ఈ వార్తాకథనం ఏంటి
దేశ వ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలలో మరో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.
ప్రధాని నరేంద్ర మోదీపై పోటీ చేసేందుకు హాస్యనటుడు రెడీ అయ్యాడు.
తన కామెడీతో అందరినీ నవ్వించే కమెడియన్ శ్యామ్ రంగీలా ఇప్పుడు రాజకీయాల్లోకి రాబోతున్నాడు.
వారణాసి లోక్‌సభ స్థానం నుంచి ప్రధాని మోదీపై పోటీ చేస్తానని శ్యామ్ రంగీలా ప్రకటించారు.
ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఎక్స్‌లో వీడియో ద్వారా ప్రకటించారు.
త్వరలో వారణాసికి వస్తానని, ఎప్పుడు నామినేషన్ దాఖలు చేస్తానో సమాచారం ఇస్తానని చెప్పారు.
తన పోస్ట్‌లో వారణాసి (#ShyamRangeelaForVaranasi) కోసం శ్యామ్‌రంగీలా అనే హ్యాష్‌ట్యాగ్ క్రియేట్ కూడా చేశారు.
Details
ప్రధానిపై ఎవరైనా ఎన్నికల్లో పోటీ చేయవచ్చు: శ్యామ్ రంగీలా
ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.. ప్రస్తుతం రాజకీయాలు హాస్యాస్పదంగా నడుస్తున్నాయి, కాబట్టి ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నానని తెలిపారు.
కాశీ.. సూరత్, ఇండోర్ లాగా ఉండకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నాను అని శ్యామ్ రంగీలా తెలిపారు.
ప్రధాని మోదీపై పోటీ చేస్తున్న విపక్షాల అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నా.. ఎన్నికల్లో ఎలాగైనా పోటీ చేస్తాను. ప్రధానిపై ఎవరైనా ఎన్నికల్లో పోటీ చేయవచ్చు, ఇదే ప్రజాస్వామ్యం.
ప్రజల మద్దతుతో వారణాసి నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పారు. త్వరలో నా యూట్యూబ్ ఛానెల్‌లో ఎన్నికల్లో పోటీ చేసే ప్రక్రియ మొత్తాన్ని ప్రకటిస్తానని తెలిపారు.
Details
నేను ఇప్పటికే ప్రజల్లో చాలా ఫేమస్: శ్యామ్ రంగీలా
కాశీలో ఎన్నికల్లో పోటీ చేసేందుకు శ్రీగంగానగర్ నుంచి ఏ టీమ్‌ను తీసుకోవడం లేదని హాస్యనటుడు శ్యామ్ రంగీలా అన్నారు.
వారణాసి ప్రజల నుంచే టీమ్ మొత్తాన్ని సిద్ధం చేస్తానని పేర్కొన్నారు. వారణాసి నుండి చాలా మంది నుండి నాకు ఫోన్ కాల్స్ వస్తున్నాయి, వారంతా నాతో చేరడానికి సిద్ధంగా ఉన్నారు.
గెలవడం, ఓడిపోవడం వేరే విషయం, అయితే ఎన్నికల్లో ఎలాగైనా ప్రధానిపై పోటీ చేస్తాను.
నేను ఫేమస్ కావడానికి ఎన్నికల్లో పోటీ చేయడం లేదు, నేను ఇప్పటికే ప్రజల్లో చాలా ఫేమస్ అని అన్నారు.
వారణాసి నుంచి కాంగ్రెస్ అజయ్‌రాయ్‌కు టికెట్ ఇవ్వగా, బీఎస్‌పీ సయ్యద్ నేయాజ్ అలీకి టికెట్ ఇచ్చింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
శ్యామ్ రంగీలా చేసిన ట్వీట్
वाराणसी मैं आ रहा हूँ…#ShyamRangeelaForVaranasi pic.twitter.com/8BOFx4nnjn
— Shyam Rangeela (@ShyamRangeela) May 1, 2024