కాంగ్రెస్-బీఆర్‌ఎస్ పొత్తు; జోస్యం చెప్పిన ఎంపీ కోమటిరెడ్డి
ఈ వార్తాకథనం ఏంటి
కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి. తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడుతుందని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి జోస్యం చెప్పారు.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఏ పార్టీకి మెజార్టీ రాదని, అందుకే కేసీఆర్ బీజేపీతో బదులు లౌకిక పార్టీ అయిన తమతో పొత్తు పెట్టుకోవాల్సి ఉంటుందని ఎంపీ కోమటిరెడ్డి పేర్కొన్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతోందని కోమటిరెడ్డి అన్నారు. కాంగ్రెస్ హైకమాండ్ సీనియర్లు, జూనియర్లను పక్కన పెట్టాలని, ఎన్నికల్లో గెలిచే వారికే టిక్కెట్లు ఇవ్వాలని సూచించారు.
కోమటిరెడ్డి
బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లు ఏదో ఒకరోజు కలుస్తాయి: బీజేపీ
టీ-కాంగ్రెస్ ఒంటరిగానే పోటీ చేస్తుందని, అయితే ఎన్నికల తర్వాత పొత్తు అనివార్యమని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు.
కోమటిరెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్‌గా మారడంతో టీ-కాంగ్రెస్‌కు మరింత ఇబ్బందిగా మారే అవకాశం ఉంది.
కొందరు నేతలు తమ బాధ్యతారాహిత్య ప్రకటనలతో అనవసరంగా కాంగ్రెస్ కేడర్‌లో గందరగోళం సృష్టిస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి పేర్కొన్నారు.
బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లు ఒకే నాణేనికి బొమ్ము, బొరుసు లాంటివని, బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లు ఏదో ఒకరోజు కలుస్తాయని, కోమటిరెడ్డి వ్యాఖ్యలే అందుకు నిదర్శనమని లక్ష్మణ్ అన్నారు.