తెలంగాణ అప్పులు రూ. 4.33లక్షల కోట్లు; లోక్‌సభ్‌లో కేంద్రం ప్రకటన
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ రాష్ట్ర అప్పులపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అప్పులు గణనీయంగా పెరిగినట్లు చెప్పింది. లోక్‌సభలో నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సమాధానం ఇచ్చారు.
2022 అక్టోబర్ నాటికి తెలంగాణ అప్పులు రూ. 4.33లక్షల కోట్లని పంకజ్ చౌదరి ప్రకటించారు. ఈ అప్పులన్నీ ప్రభుత్వ పరిధిలోని కార్పొరేషన్లు, వివిధ సంస్థలు చేసినట్లు ఆయన వివరించారు.
తెలంగాణ
అప్పులు ఏడాదికేడాది పెరుగుతున్నాయి: పంకజ్ చౌదరి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులు ఏడాదికేడాది పెరుగుతున్నాయే కానీ ఏ మాత్రం తగ్గడం లేదని కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడిన నాటికి రూ. 75,577కోట్ల అప్పులుంటే, 2022 నాటికి అవి రూ.2,83,452కు చేసినట్లు చెప్పారు.
వీటికి తోడు కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థలకు రుణాలు కూడా ఇచ్చినట్లు ఆయా బ్యాంకర్లు కేంద్రానికి నివేదించినట్లు పంకజ్ చౌదరి వివరించారు.
తెలంగాణ ప్రభుత్వ అప్పులపై కొంతకాలంగా విపక్షలు విమర్శిస్తున్నాయి. ఇటీవల అసెంబ్లీలో బట్టి విక్రమార్క కూడా ఈ విషయాన్ని ప్రస్తావించారు. తెలంగాణ అప్పులు రూ.5లక్షల కోట్లకు చేరుకున్నట్లు ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.