
Rahul Gandhi: కర్ణాటక బీజేపీ పరువు నష్టం కేసులో.. ఈరోజు బెంగళూరు కోర్టుకు రాహుల్ గాంధీ
ఈ వార్తాకథనం ఏంటి
కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ నేడు (శుక్రవారం) బెంగళూరుకు వెళ్లనున్నారు. ఇక, బీజేపీ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో బెంగళూరు కోర్టుకు హాజరుకానున్నారు.
డీకే శివకుమార్, సిద్ధరామయ్య, రాహుల్ గాంధీ సహా కాంగ్రెస్ నేతలు.. గత బీజేపీ ప్రభుత్వం అవినీతిమయమైందని తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించారు.
దీంతో బీజేపీ నేత ఎస్ కేశవ ప్రసాద్ పరువు నష్టం దావా వేశారు. దీనిపై ఇవాళ తమ ఎదుట హాజరుకావాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఇదిలా ఉంటే ఈ కేసులో ఇప్పటికే కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం శివకుమార్‌లకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
Details
పబ్లిక్ వర్క్స్‌లో 40 శాతం కమీషన్
ఇక, కాంగ్రెస్ నేతలు నాటి ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై సహా బీజేపీ నేతలపై ప్రముఖ పత్రికల్లో తప్పుడు ప్రకటనలు ఇచ్చారని ఆరోపించారు.
అన్ని పబ్లిక్ వర్క్స్‌లో 40 శాతం కమీషన్ తీసుకుంటున్నారని కాంగ్రెస్ ఆరోపిస్తూ 'కరప్షన్ రేట్ కార్డ్' కూడా ప్రచురించింది.
అదే సమయంలో, రాహుల్ గాంధీ తన సోషల్ మీడియా ఖాతా ఎక్స్‌లో కూడా అవమానకరమైన ప్రకటనను కూడా పోస్ట్ చేశారు.
కాగా,ప్రకటన ప్రచురణలో రాహుల్ గాంధీ ప్రమేయం లేదని కాంగ్రెస్ పార్టీ అంటోంది.
జూన్ 1వ తేదీన హాజరు కానందుకు రాహుల్ గాంధీపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయాలని కర్ణాటక బీజేపీ యూనిట్ న్యాయస్థానాన్ని కోరింది.
అయితే, జూన్ 7న తప్పనిసరిగా హాజరుకావాలంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.