I.N.D.I.A కూటమి ఏర్పడింది కానీ... అసెంబ్లీ ఎన్నికలపై కాంగ్రెస్ ఎక్కువ ఆసక్తి చూపుతోంది: నితీశ్ కుమార్
బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గురువారం మాట్లాడుతూ I.N.D.I.A బ్లాక్ ఏర్పడిందే కానీ దూకుడు కొనసాగించలేక పోతోందన్నారు. ఐదు రాష్ట్రాల్లో జరగనున్న రాబోయే అసెంబ్లీ ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ ఎక్కువ ఆసక్తి చూపిస్తోందే గాని విపక్షాల కూటమిపై (INDIA) అంతగా దృష్టిపెట్టడం లేదన్నారు. బీజేపీని అధికారం నుండి తరిమికొట్టండి, దేశాన్ని రక్షించండి అనే థీమ్‌తో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా పట్నాలో నిర్వహించిన ర్యాలీలో నితీష్ మాట్లాడారు.
లోక్‌సభ ఎన్నికల సన్నద్ధతపై ఆలస్యం: నితీష్
I.N.D.I.A కూటమి ఏర్పడిందే కానీ పెద్దగా విపక్షాల కూటమిలో పెద్దగా పురోగతి లేదన్నారు. 5 రాష్ట్రాలలో ఎన్నికలు జరుగనున్న దృష్ట్యా కాంగ్రెస్‌కు వాటిపైనే ఆసక్తి ఎక్కువ అయ్యిందని అన్నారు. I.N.D.I.A సంకీర్ణంలో, కాంగ్రెస్‌ను ముందుండి నడిపించడానికి మేమంతా అంగీకరించాము. కానీ వారు ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు ముగిసిన తర్వాతే తదుపరి సమావేశం ఏర్పాటుకు వారు సిద్ధమైనట్లు కనిపిస్తోందన్నారు. రానున్న లోక్‌సభ ఎన్నికల సన్నద్ధతపై ఆలస్యం అవుతోందన్నారు. దేశ చరిత్రను మార్చేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తున్నారని నితీష్ ఆరోపించారు. ఇదే వేదికపై ఉన్న జేడీయూ నేతలు, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి రాజా, ఇతర సీనియర్ నత్తలు కూడా కాంగ్రెస్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.