'కాంగ్రెస్ 'వారంటీ' గడువు ముగిసింది'; హస్తం పార్టీపై ప్రధాని మోదీ సెటైర్లు
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీపై ప్రధాని మోదీ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ వారంటీ గడువు ముగిసిందని, అది ఎటువంటి హామీని ఇచ్చే స్థితిలో లేదని అన్నారు. ఉచితాల పేరుతో కాంగ్రెస్ నాయకులు మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మోదీ దుయ్యబట్టారు. కర్ణాటక ప్రజల ఉజ్వల భవిష్యత్తు గురించి, భవిష్యత్తు తరాల గురించి ఆలోచించాలని యువతకు నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్‌లో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల కోసం అక్కడి ప్రజల ఇంకా ఎదురుచూస్తున్నారని మోదీ పేర్కొన్నారు.
అధికారంలో ఉన్నప్పుడు వర్తమానంతో పాటు భవిష్యత్తు గురించి ఆలోచించాలి: మోదీ
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కర్ణాటకలోని అన్ని కుటుంబాల మహిళా పెద్దలకు నెలకు రూ.2,000 అందజేస్తామని హామీ ఇచ్చింది. అన్ని గృహాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తును అందిస్తామని చెప్పింది. అయితే రాజకీయాల్లో ఫ్రీ కల్చర్‌ను ప్రధాని తప్పుదోవ పట్టించారు. అధికారం కోసం కొన్ని రాజకీయ పార్టీలు ఈ పద్ధతిని అవలంబిస్తున్నాయని మండిపడ్డారు. కొన్ని రాజకీయ పార్టీలు అధికారం కోసం దేశ భవిష్యత్తు, కర్ణాటక ప్రజల గురించి పట్టించుకోవడం లేదని కాంగ్రెస్‌పై విమర్శాస్త్రాలు సంధించారు. అధికారంలో ఉన్న ప్రభుత్వం పాలించే సమయంలో వర్తమానం గురించి మాత్రమే కాకుండా భవిష్యత్తు గురించి కూడా ఆలోచించాలని ప్రధాని మోదీ నొక్కిచెప్పారు. భారతదేశాన్ని అభివృద్ధి చేసే దిశలో బీజేపీ పనిచేస్తుందని అన్నారు.
ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి