Amethi-Raibareli-Congress: నేడు అమేథీ, రాయ్ బరేలీ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక
ఈ వార్తాకథనం ఏంటి
అమేథీ(Amethi), రాయ్‌బరేలీ(Rai Bareli)లోక్ సభ(Lok Sabha)నియోజకవర్గాలకు మే 20న ఐదో దశ లోక్‌సభ ఎన్నికల పోలింగ్(Polling)జరగనుంది.
ఈ నేపథ్యంలో అమేథీ, రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేసేందుకు కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) శనివారం సమావేశం కానుంది.
ఈ సమావేశానికి యూపీ కాంగ్రెస్ నేతలు, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) ప్రధాన కార్యదర్శి అవినాష్ పాండే (Avinash Pandey) లను పిలిచినట్లు కాంగ్రెస్ వర్గాలు మీడియాకు వెల్లడించాయి.
ఇదివరకే ఈ సీట్లలో గాంధీ కుటుంబం నుంచి పోటీ చేయాలని ఉత్తర్ ప్రదేశ్ (Uttar Pradesh) రాష్ట్ర కాంగ్రెస్ సీఈసీకి ప్రతిపాదించింది.
అయితే ఎవరు ఎక్కడ పోటీచేయాలనే నిర్ణయాన్ని కాంగ్రెస్ ఎన్నికల కమిటీ (సీఈసీ), కాంగ్రెస్ అధిష్టానానికే వదిలేసింది.
Rahul Gandhi-Priyanka
బరిలోకి రాహుల్, ప్రియాంక గాంధీ
కాగా, అమేథీ, రాయ్‌బరేలీ స్థానాలకు రాహుల్ గాంధీ (Rahul Gandhi), ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) అభ్యర్థులుగా ఎంపికయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
అమేథీ లో ప్రియాంక భర్త రాబర్ట్ వాద్రా (Robert Vadra) కూడా పోటీ చేయాలనుకున్నట్లు వార్తలు వెలువడ్డాయి.
అమేథీలాగా, కాంగ్రెస్ కు కంచుకోట అయిన రాయ్ బరేలీ నియోజకవర్గం కు ఇదివరకు ఫిరోజ్ గాంధీ, ఇందిరా గాంధీ సోనియా గాంధీ ప్రాతినిధ్యం వహించారు.
అయితే సోనియా గాంధీ రాజ్యసభకు వెళ్లడంతో రాయ్‌బరేలీ నుంచి ప్రియాంక బరిలోకి దిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది.