
CWC MEET : 5 రాష్ట్రాల ఎన్నికలపై కాంగ్రెస్ అధిష్టానం సన్నద్ధత.. బీసీ, మహిళల అంశాలే ఎజెండా
ఈ వార్తాకథనం ఏంటి
భారతదేశంలోని 5 రాష్ట్రాలకు త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ జోరు పెంచింది.
ఈ మేరకు ఇవాళ సీడబ్ల్యూసీ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. కీలకమైన అంశాలను ఎన్నికల అజెండాగా ఎత్తుకోవాలని భావిస్తోంది.
దిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) భేటికి పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పాలిత సీఎంలు, ఇతర కీలక నేతలు హాజరయ్యారు.
రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, తెలంగాణ, మిజోరం అసెంబ్లీ ఎన్నికలకు సమర్థమైన వ్యూహం పాటించాల్సి ఉందని ఖర్గే పేర్కొన్నారు.
ఇటీవలే హిమాచల్, కర్ణాటకలో పార్టీ అద్భుత విజయాలు శ్రేణుల్లో నూతనోత్సాహం తెచ్చాయన్నారు.
EMBED
ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్ సీడబ్ల్యూసీ సమావేశం
Sharing some excerpts from my opening remarks in the Congress Working Committee Meeting, held today in Delhi —
I extend a warm welcome to this Congress Working Committee (CWC) meeting. In our first meeting in Hyderabad last month, we pledged to rid the country of divisive... pic.twitter.com/6520lExUBa— Mallikarjun Kharge (@kharge) October 9, 2023 Sharing some excerpts from my opening remarks in the Congress Working Committee Meeting, held today in Delhi —
I extend a warm welcome to this Congress Working Committee (CWC) meeting. In our first meeting in Hyderabad last month, we pledged to rid the country of divisive... pic.twitter.com/6520lExUBa— Mallikarjun Kharge (@kharge) October 9, 2023
DETAILS
అధికారంలోకి వచ్చాక ఓబీసీ మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తూ చట్టాన్ని అమలు చేస్తామన్న ఖర్గే
జాతీయ స్థాయిలో కాంగ్రెస్ క్యాడర్ అంతా, సమన్వయం, క్రమశిక్షణ, ఐక్యతతో పని చేయాలని మల్లికార్జున్ ఖర్గే పిలుపునిచ్చారు.
బలహీనవర్గాలైన ఎస్సీ, ఎస్టీ, బీసీల స్థితిగతులపై సామాజిక, ఆర్థిక, రాజకీయ వివరాలను పార్టీ నాయకులు తెలుసుకుని సన్నద్ధం కావాలన్నారు.
ఈ మేరకు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు సామాజిక న్యాయం, హక్కులు కల్పించేందుకు దేశ వ్యాప్తంగా కుల గణన అంశాన్ని మరోసారి ఆయన గుర్తు చేశారు.
మరోవైపు లోక్‌సభ ఎన్నికలూ సమీపిస్తున్న క్రమంలో సమన్వయం, క్రమశిక్షణ తప్పనిసరిగా ఉండాలన్నారు.
2024లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఓబీసీ మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తూనే మహిళా రిజర్వేషన్ల చట్టాన్ని అమలు చేస్తామన్నారు.
విపక్ష కూటమి ఇండియా, ప్రధాని మోదీపై ప్రభావం చూపిస్తోందని, అధికార పార్టీ తప్పుడు ప్రచారాలను వ్యూహాత్మకంగా ఎదుర్కోవాలన్నారు.