Page Loader
Hyderabad: హైదరాబాద్‌లో రూ. 450 కోట్ల పెట్టుబడితో ఐటీ పార్కు నిర్మాణం
హైదరాబాద్‌లో రూ. 450 కోట్ల పెట్టుబడితో ఐటీ పార్కు నిర్మాణం

Hyderabad: హైదరాబాద్‌లో రూ. 450 కోట్ల పెట్టుబడితో ఐటీ పార్కు నిర్మాణం

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 19, 2025
12:51 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ రైజింగ్‌ ప్రతినిధి బృందం సింగపూర్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ బృందం క్యాపిటల్‌ ల్యాండ్‌ ప్రతినిధులతో సమావేశమైంది. ఇందులో హైదరాబాద్‌లో రూ.450 కోట్ల పెట్టుబడితో ఐటీ పార్కు నిర్మించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఐటీ పార్కు లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించనున్నారు. ఇక తెలంగాణలోని ముచ్చర్ల సమీపంలోని మీర్‌ఖాన్‌పేటలో రూ.3,500 కోట్ల పెట్టుబడితో ఎస్టీ టెలీమీడియా గ్లోబల్‌ డేటా సెంటర్‌ ప్రారంభించేందుకు ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ డేటా సెంటర్‌ క్యాంపస్‌ను అత్యాధునిక ఏఐ ఆధారితంగా స్థాపించేందుకు కంపెనీ ప్రభుత్వం తో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) చేసుకుంది.