LOADING...
'incorrect Indian map': బెళ‌గావిలో కాంగ్రెస్ మీటింగ్‌లో 'భార‌త‌దేశ‌ మ్యాప్‌పై వివాదం 
బెళ‌గావిలో కాంగ్రెస్ మీటింగ్‌లో 'భార‌త‌దేశ‌ మ్యాప్‌పై వివాదం

'incorrect Indian map': బెళ‌గావిలో కాంగ్రెస్ మీటింగ్‌లో 'భార‌త‌దేశ‌ మ్యాప్‌పై వివాదం 

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 26, 2024
05:13 pm

ఈ వార్తాకథనం ఏంటి

కర్ణాటకలోని బెళగావిలో కాంగ్రెస్ పార్టీ సమావేశాలు జరుగుతున్నాయి. 1924 నాటి స్మారక సమావేశాలను గుర్తుచేస్తూ, ఈ రోజు స్మారక మీటింగ్‌ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నగరంలో పోస్టర్లను ప్రదర్శించారు. కానీ ఆ పోస్టర్లపై ఉన్న భారతదేశ మ్యాప్‌లో పొరపాటు జరిగింది. ఈ మ్యాప్‌లో పాకిస్థాన్ ఆక్రమించిన గిల్‌గిత్ ప్రాంతం,చైనా ఆధీనంలో ఉన్న ఆక్సాయ్ చిన్ ప్రాంతాలు చూపించలేదు, దీనిపై బీజేపీ తీవ్రంగా ఆక్షేపించింది. అవి జమ్మూకశ్మీర్‌లో భాగమే అని పేర్కొంది.

వివరాలు 

ఈర్ష్య‌కు మందు లేదు:డీకే శివకుమార్

ఈ వివాదంపై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్పందించారు. పోస్టర్లలో ఏదైనా పొరపాటు ఉంటే వాటిని తొలగిస్తామంటూ చెప్పారు. "బహుశా కొంతమంది తప్పు చేసి ఉంటారు, వాటిని తొలగిస్తున్నాము" అని పేర్కొన్నారు. తమపై బీజేపీ అసత్య ఆరోపణలు చేస్తున్నదని, ఈర్ష్య‌కు మందు లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ వైఖరిపై బీజేపీ తీవ్ర విమర్శలు చేసింది. రాహుల్ గాంధీపై వ్యంగ్యాస్త్రాలు సంధించింది. "మొహబత్త్ కీ దుకాన్" అని, "చైనాకు తరచుగా వారసత్వం ఇవ్వాలని, భారత్‌ను విభజించేందుకు ప్రయత్నిస్తారని" బీజేపీ ఆరోపించింది. కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయం కోసం భారతదేశ మ్యాప్‌ను తప్పుగా చూపించిందని బీజేపీ మండిపడింది.

వివరాలు 

ఐపీసీ సెక్షన్ 74 ప్రకారం నేరం

సమావేశాలు నిర్వహిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని, విజయపుర బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నల్ డిమాండ్ చేశారు. "భారతదేశం సక్రమమైన మ్యాప్‌ను చూపించకపోతే అది చట్టపరంగా ఉల్లంఘనగా పరిగణించబడుతుంది" అన్నారు. తప్పుడు మ్యాప్‌ను ప్రచురించడం ఐపీసీ సెక్షన్ 74 ప్రకారం నేరం అని, అలాగే నేషనల్ హానర్ యాక్ట్ ప్రకారం కూడా ఇది ఉల్లంఘన అని తెలిపారు.