
Agra: దళిత మహిళపై అత్యాచారం.. ఆపై గొంతుకోసి హత్య
ఈ వార్తాకథనం ఏంటి
ఉత్తర్‌ప్రదేశ్ లోని ఆగ్రాలో 25 ఏళ్ల దళిత మహిళపై పోలీసు కానిస్టేబుల్ అత్యాచారం చేసి, గొంతు కోసి చంపాడు.
డిసెంబరు 29న కానిస్టేబుల్ రాఘవేంద్ర సింగ్ (27) అద్దెకు తీసుకున్న గదిలో మహిళ మృతదేహం వేలాడుతూ కనిపించింది.
ఉరివేసుకున్నట్లు పోస్ట్‌మార్టం నిర్ధారించింది. పోలీసు అధికారిని అరెస్టు చేశారు.
ఆగ్రాలో విధులు నిర్వహిస్తున్న రాఘవేంద్ర సింగ్ (27) అనే పోలీసు కానిస్టేబుల్ బెలంగంజ్‌లోని తన అద్దె గదిలో 25 ఏళ్ల మహిళను అత్యాచారం చేసి, గొంతు కోసి చంపినట్లు నిర్ధారణ కావడంతో అతనిని అరెస్టు చేసినట్లు సీనియర్ పోలీసు అధికారి ఆర్‌కె సింగ్ వార్తా సంస్థ పిటిఐకి తెలిపారు.
Details
దళిత మహిళతో పెళ్ళికి నిరాకరించిన సింగ్ కుటుంబం
మహిళ కుటుంబం ప్రకారం, సింగ్, మహిళ ఝాన్సీలో నర్సింగ్ శిక్షణ పొందారు. వారిద్దరికీ అక్కడే పరిచయం అయ్యింది.
రాఘవేంద్ర సింగ్ కుటుంబం వారి పెళ్లి ప్రతిపాదనను తిరస్కరించిందని, అయినప్పటికీ అతను తన సోదరితో సన్నిహితంగా ఉన్నాడని మహిళ సోదరుడు చెప్పాడు.
ఘటనకు ఒకరోజు ముందు కానిస్టేబుల్ అద్దెకు తీసుకున్న గదికి మహిళ వెళ్లిందని పోలీసులు తెలిపారు.
కానిస్టేబుల్ రాఘవేంద్ర సింగ్ ఝాన్సీకి చెందినవాడు.బెళంగాంజ్‌లో అద్దెకు ఉంటున్నాడు.
బాలిక గురుగ్రామ్‌లోని కిడ్నీ సెంటర్‌లో పనిచేస్తోందని ఆర్‌కె సింగ్ చెప్పారు.
సంఘటన జరిగిన రోజు,సింగ్ తన కార్యాలయానికి వచ్చినప్పటికీ, త్వరగా వెళ్ళిపోయాడు.
అనంతరం జరిగిన విషయాన్ని తన సహోద్యోగులకు తెలిపినట్లు పోలీసులు తెలిపారు. మహిళ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఆదివారం కానిస్టేబుల్‌ను అరెస్టు చేశారు.