ఏప్రిల్ 10, 11 తేదీల్లో కరోనా మాక్ డ్రిల్; ఆరోగ్య శాఖ ఏర్పాట్లు
దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నెల 10, 11తేదీల్లో మాక్ డ్రిల్ నిర్వహించేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని ఆరోగ్య శాఖలు ఏర్పాట్లు చేస్తున్నాయి. దేశంలోని అని జిల్లాలు, రాష్ట్రాల్లో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా సంసిద్ధతను, వసతులను తెలుసుకునేందుకు కేంద్రం ఈ మాక్ డ్రిల్ నిర్వహిస్తోంది. ఈ మాక్ డ్రిల్ ద్వారా మందులు, ఆసుపత్రి పడకలు, వైద్య పరికరాలు, వైద్య ఆక్సిజన్ లభ్యతను అంచనా వేయడానికి కేంద్రానికి సులువుగా ఉంటుంది.
కరోనా ల్యాబ్‌లు, కోవిడ్ పరీక్ష కిట్ల లభ్యతపై ఆరోగ్యశాఖ ఫోకస్
మాక్ డ్రిల్‌లో భాగంగా ఆస్పత్రుల్లో సిబ్బందిని అంచనా వేయనున్నారు. ముఖ్యంగా వైదులు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది, అంగన్ వాడీ కార్యకర్తల వివరాలను ఈ సందర్భంగా సేకరించనున్నారు. ఇదిలా ఉంటే, కరోనాపై శిక్షణ పొందిన డాక్టర్లు, వైద్య నిపుణులు, వెంటిలేటర్లు, ఆక్సిజన్, పీఎస్ఏ ప్లాంట్ల నిర్వహణలో అనుభవం ఉన్న వారి వివరాలను నమోదు చేయనున్నారు. ముఖ్యంగా అంబులెన్స్ వివారాలను సేకరించి, వాటిని వివరాలను నమోదు చేసేందుకు వైద్యారోగ్య శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అన్నింటింకే ముఖ్యంగా కరోనా ల్యాబ్‌లు, కోవిడ్ పరీక్ష కిట్ల లభ్యతపై ఆరోగ్య శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించనున్నారు.