Revanth Reddy: రక్షణ పరిశ్రమల అభివృద్ధికి హైదరాబాద్‌లో కారిడార్లు అవసరం: రేవంత్ రెడ్డి
ఈ వార్తాకథనం ఏంటి
హైదరాబాద్ గచ్చిబౌలిలో డిఫెన్స్ ఎగ్జిబిషన్‌ను శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కలిసి ప్రారంభించారు.
మూడు రోజుల పాటు కొనసాగనున్న ఈ ప్రదర్శనలో, శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారతదేశం సాధించిన పురోగతిని ప్రదర్శించనున్నారు.
ముఖ్యంగా త్రివిధ దళాల ప్రాముఖ్యతపై యువతకు అవగాహన కల్పించేందుకు ఈ ఎగ్జిబిషన్ ఉపయుక్తమవుతుందని తెలిపారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, దేశ రక్షణలో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు.
Details
డిఫెన్స్ ఎగ్జిబిషన్ ఎంతో ఉపయోగకరం
ఇప్పటికే హైదరాబాద్‌లో డీఆర్‌డీవో, డీఆర్‌డీఎల్, బీడీఎల్, మిథానీ వంటి ప్రముఖ రక్షణ పరిశ్రమలు ఉన్నాయని, ఇవి భారత రక్షణ వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్నాయని వివరించారు.
సంప్రదాయ ఇంజనీరింగ్‌కు తోడ్పాటుగా డిఫెన్స్ ఎగ్జిబిషన్ ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు.
బెంగళూరును అనుసరించి, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో రక్షణ శాఖ కారిడార్లు ఏర్పాటు చేయాలని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను సీఎం రేవంత్ రెడ్డి కోరారు.
కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ, ఫిబ్రవరి 28న obel అవార్డు గ్రహీత సర్ సీవీ రామన్ "రామన్ ఎఫెక్ట్"ను కనుగొన్న రోజని, ఆయన గౌరవార్థం ఈ రోజును జాతీయ సైన్స్ దినోత్సవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు.
Details
శాస్త్రవేత్తలను యువత ఆదర్శంగా తీసుకోవాలి
తాను కూడా సైన్స్ విద్యార్థినని, రాజకీయాల్లోకి రాకముందు కొన్నాళ్లు సైన్స్ అధ్యాపకుడిగా పనిచేశానని వివరించారు.
యువత శాస్త్రవేత్తలను ఆదర్శంగా తీసుకోవాలని, సైన్స్ టెక్నాలజీలో వస్తున్న మార్పులను అధ్యయనం చేయాలని రాజ్‌నాథ్ సింగ్ సూచించారు.
భారతదేశం గ్లోబల్ లీడర్‌గా ఎదిగేందుకు సైన్స్ అండ్ టెక్నాలజీ ముఖ్య భూమిక వహిస్తోందని, రక్షణ శాఖ అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోందని ఆయన వివరించారు.
దేశ రక్షణలో తెలంగాణ ఉనికిని మరింత బలోపేతం చేయడానికి కృషి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా అన్నారు.