Fraud:ప్రధాని మోదీ కార్యదర్శికి కుమార్తె,అల్లుడినంటూ.. కోట్ల రూపాయలు గుంజిన దంపతులు అరెస్ట్
ఈ వార్తాకథనం ఏంటి
ఒడిశాలోని ప్రముఖ నాయకులు, ఉన్నతాధికారులతో తమకు సన్నిహిత సంబంధాలున్నట్టు చెప్పి, ప్రధాని మోదీ వ్యక్తిగత కార్యదర్శి పీకే మిశ్రా కుటుంబ సభ్యులుగా చెలామణి అవుతూ అడ్డంగా దొరికిపోయిందో ఓ జంట.
హన్సితా అభిలిప్సా, అనిల్ మహంతి అనే ఈ జంట, పలువురు వ్యాపారులు, బిల్డర్లను మోసం చేసారు.
వీరు భువనేశ్వర్‌లోని ఇన్ఫోసిటీ ప్రాంతంలో విలాసవంతమైన కార్యాలయం నిర్వహిస్తూ, ప్రభుత్వ టెండర్లను ఇప్పిస్తామంటూ మాయమాటలు చెప్పేవారు.
ఇష్టమైన వ్యాపారాలను చేసే సాధనంగా తమ పరిచయాలను వాడుకునేవారు.
ప్రముఖులతో దిగిన ఫోటోలను చూపించి బాధితులను నమ్మించి భారీ మొత్తంలో డబ్బు సేకరించేవారు.
వివరాలు
ధనవంతులే టార్గెట్
గతంలో వీరి వల్ల మోసపోయిన ఓ గనుల వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ జంట పట్టుబడింది.
వీరు ప్రధానంగా మైనింగ్, నిర్మాణ రంగాల నుంచి ధనవంతులను టార్గెట్ చేసేవారని పోలీసులు వెల్లడించారు.
అభిలిప్సా తరచుగా సందర్భాన్ని బట్టి ఉన్నతాధికారులు, రాజకీయ నాయకుల భార్యగా కూడా చలామణీ అయ్యేది.
ముఖ్యంగా వారు ప్రజలకు ముఖ్యమైన ప్రభుత్వ నిర్ణయాలను ప్రభావితం చేయగలమని నమ్మించి మోసం చేసేవారు.
అడిషనల్ డీసీపీ స్వరాజ్ మాట్లాడుతూ, "మాకున్న సమాచార ప్రకారం, హన్సితా, అనిల్ పీకే మిశ్రా సమీప బంధువులుగా పలువురిని మోసం చేశారు. డిసెంబర్ 26న వారి మీద కేసు నమోదైంది," అని వెల్లడించారు.