Page Loader
Covid: బెంగళూరులో మళ్లీ కొవిడ్ కలకలం.. వృద్ధుడి మృతి!
బెంగళూరులో మళ్లీ కొవిడ్ కలకలం.. వృద్ధుడి మృతి!

Covid: బెంగళూరులో మళ్లీ కొవిడ్ కలకలం.. వృద్ధుడి మృతి!

వ్రాసిన వారు Jayachandra Akuri
May 25, 2025
10:54 am

ఈ వార్తాకథనం ఏంటి

బెంగళూరు నగరంలో మళ్లీ కోవిడ్ మృతిపై ఆందోళన నెలకొంది. శనివారం 85 ఏళ్ల వృద్ధుడు కొవిడ్ కారణంగా మరణించినట్టు కర్ణాటక ఆరోగ్య శాఖ అధికారికంగా వెల్లడించింది. 24 గంటల వ్యవధిలో రాష్ట్రవ్యాప్తంగా 108 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, వీరిలో ఐదుగురికి పాజిటివ్‌గా తేలింది. తాజా గణాంకాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 38 యాక్టివ్ కేసులు ఉండగా, వారిలో 32 మంది బెంగళూరులోనే చికిత్స పొందుతున్నారు. కరోనా కేసుల పెరుగుదలపై రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దినేష్ గుండూరావు స్పందించారు. "ఇది ఆందోళనకు గురిచేసే విషయం కాదు. ప్రస్తుతం పరిస్థితి సాధారణంగానే ఉంది. 15 రోజులుగా కోవిడ్ కేసులు స్వల్పంగా పెరిగాయని ఆయన మీడియాతో అన్నారు.

Details

కరోనా పరీక్షలు చేయించుకోవాలి

ఆసుపత్రుల్లో ఉన్నవారు, తీవ్రమైన శ్వాసకోశ సమస్యలతో బాధపడేవారు తప్పనిసరిగా కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, గర్భిణులు, చిన్నపిల్లలు రద్దీ ప్రదేశాలకు వెళ్లేటప్పుడు మాస్కులు ధరించాలని సూచించినప్పటికీ, మాస్కు ధరించడం అనివార్యమో కాదని స్పష్టం చేశారు. అలాగే ప్రయాణాలపై ఎలాంటి ఆంక్షలు అమలులో లేవని తెలిపారు. కరోనా మన సమాజంలో ఒక సాధారణ వైరస్‌లా మారింది. తీవ్రమైన లక్షణాలు లేని స్థితిలో భయపడాల్సిన అవసరం లేదు. ప్రజలు తమ దైనందిన జీవితాన్ని సాధారణంగా కొనసాగించవచ్చని మంత్రి వివరించారు. చేతులు శుభ్రంగా ఉంచుకోవడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం వంటివి కేవలం కొవిడ్‌కే కాదు, ఇతర వైరస్ వ్యాధులకు కూడా వ్యతిరేకంగా పనిచేస్తాయని ఆయన హితవు పలికారు.