Page Loader
CRPF Jawan: పాక్ కు గూఢచర్యం చేస్తున్న CRPF జవాన్ అరెస్టు.. ఎన్ఐఏ కస్టడీ విధించిన న్యాయస్థానం 
పాక్ కు గూఢచర్యం చేస్తున్న CRPF జవాన్ అరెస్టు.. ఎన్ఐఏ కస్టడీ విధించిన న్యాయస్థానం

CRPF Jawan: పాక్ కు గూఢచర్యం చేస్తున్న CRPF జవాన్ అరెస్టు.. ఎన్ఐఏ కస్టడీ విధించిన న్యాయస్థానం 

వ్రాసిన వారు Sirish Praharaju
May 26, 2025
01:51 pm

ఈ వార్తాకథనం ఏంటి

పాకిస్థాన్ కోసం గూఢచర్యం చేస్తున్న యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా ఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. దేశవ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వాలకు హెచ్చరికలు జారీ చేసి, అనుమానాస్పద గూఢచారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఫలితంగా ఇప్పటికే పలువురు అనుమానితులను వివిధ రాష్ట్రాల్లో పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. వారిలో కొంతమంది డబ్బు కోసం పాకిస్థాన్‌కు కీలక సమాచారాన్ని చేరవేస్తుండగా, మరికొందరు హనీట్రాప్ లో చిక్కుకొని గూఢచార్యం చేస్తున్నారు. ఇదే సమయంలో తాజాగా సీఆర్ పీఎఫ్ జవాను ఒకరు గూఢచారిగా వ్యవహరించినట్లు తెలిసింది. పాకిస్థాన్‌కు కీలకమైన సమాచారాన్ని చేరవేశాడనే ఆరోపణలపై ఓ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) జవాను‌ను జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) అధికారులు అరెస్ట్ చేశారు.

వివరాలు 

నిందితుడిని జూన్ 6 వరకు NIA కస్టడీలో..

అనంతరం అతడిని ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు.ఈ కేసును పరిశీలించిన న్యాయస్థానం తీవ్రంగా స్పందించింది. ఈఆరోపణలు భారతదేశ భద్రతకు సీరియస్ ముప్పుగా మారే అవకాశం ఉందని వ్యాఖ్యానించింది. "ఇది దేశ భద్రతను మాత్రమే కాదు, భారతదేశాన్ని సందర్శించే విదేశీయులు,అలాగే మన పౌరుల ప్రాణాలను ప్రమాదంలో పడేసే తీవ్రమైన వ్యవహారం" అని కోర్టు పేర్కొంది. అందుకే,నిందితుడు పాకిస్థాన్‌కు ఏవిధమైన రహస్యాలు పంపాడన్న అంశాన్ని పూర్తిగా వెలికితీయాల్సిన అవసరం ఉందని కోర్టు పేర్కొంది. నిందితుడిని జూన్ 6 వరకు NIA కస్టడీలో ఉంచాలని ఆదేశించింది. "దేశ రక్షణ వ్యవస్థలో సాయుధ బలగాల పాత్ర అత్యంత కీలకం.అలాంటి బలగాల్లో పనిచేసే వ్యక్తులు దేశ భద్రతను పణంగా పెట్టి గూఢచర్యానికి పాల్పడటం తీవ్రంగా పరిగణించాల్సిన విషయం"అని కోర్టు స్పష్టం చేసింది.

వివరాలు 

చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (UAPA) కింద కేసులు నమోదు

అతనిపై చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (UAPA) కింద కేసులు నమోదు చేశారు. అందులో సెక్షన్ 15 (ఉగ్రవాద చర్యలు), సెక్షన్ 16 (అటువంటి చర్యలకు శిక్షలు), సెక్షన్ 18 (కుట్రలు, సంబంధిత చర్యలపై శిక్షలు) నెత్తిన మోపినట్లు అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా, ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్ వద్ద జరిగిన ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయిన ఘటన నేపథ్యంలో, పాక్‌కు సమాచారాన్ని అందజేస్తున్న గూఢచారులు, ఉగ్రవాద కార్యకలాపాలకు సహకరిస్తున్నవారిపై భద్రతా సంస్థలు తీవ్ర చర్యలు తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో తాజా అరెస్టు చోటు చేసుకున్నట్లు సమాచారం.