
Gurugram: దారుణం.. ఐసీయూలో వెంటిలేటర్‌పై ఉన్న ఎయిర్‌హోస్ట్‌పై అత్యాచారం!
ఈ వార్తాకథనం ఏంటి
హర్యానాలోని గురుగ్రామ్‌లో జరిగిన దారుణ ఘటన సభ్య సమాజాన్ని షాక్‌కు గురిచేసింది. అపస్మారక స్థితిలో ఉన్న ఓ మహిళపై ఆస్పత్రిలోనే అత్యాచారం జరిగిందన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి.
46 ఏళ్ల ఎయిర్ హోస్టెస్, సంస్థ తరఫున శిక్షణ కోసం గురుగ్రామ్‌కు వచ్చి, ఓ హోటల్‌లో బస చేస్తోంది. శిక్షణ సమయంలో స్విమ్మింగ్ పూల్‌లో ఈత కొడుతూ ఆమె నీటిలో మునిగి తీవ్ర అస్వస్థతకు గురయ్యింది.
తక్షణమే రక్షించిన సిబ్బంది ఆమెను ప్రాథమిక చికిత్స అనంతరం ఏప్రిల్ 5న ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు.
అక్కడ ఐసీయూలో ఆమెకు చికిత్స జరుగుతుండగా, అదే ఆస్పత్రిలో పని చేసే ఒక ఉద్యోగి అత్యంత క్రూరంగా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఏప్రిల్ 6న ఈ దారుణం చోటుచేసుకుంది.
Details
ఘటనపై స్పందిచని ఆస్పత్రి యాజమాన్యం
బాధితురాలు అప్పటికే స్పృహ లేని స్థితిలో ఉండగా, ఈ ఘోరానికి పాల్పడినట్లు తెలుస్తోంది.
ఆ సమయంలో సమీపంలో ఇద్దరు నర్సులు ఉన్నప్పటికీ వారు స్పందించకపోవడం మరింత తీవ్రంగా కనిపిస్తోంది. ఆసుపత్రి సిబ్బందిలోని వ్యక్తి ఈ పనికి పాల్పడాడని ఆరోపణలు వస్తున్నాయి.
బాధితురాలు ఏప్రిల్ 13న డిశ్చార్జ్ అయ్యాక, తన భర్తకు ఈ విషయం తెలియజేయడంతో.. అతడు వెంటనే ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేశాడు.
పోలీసులు బాధితురాలి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి, ఆసుపత్రి సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు.
నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు. ఇదిలా ఉండగా, ఈ ఘటనపై ఆసుపత్రి యాజమాన్యం ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
ఆ మహిళపై జరిగిన ఈ దారుణ ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.