LOADING...
Amaravati : అమరావతిలో 250 ఎకరాల్లో కల్చర్‌ డిస్ట్రిక్ట్‌
అమరావతిలో 250 ఎకరాల్లో కల్చర్‌ డిస్ట్రిక్ట్‌

Amaravati : అమరావతిలో 250 ఎకరాల్లో కల్చర్‌ డిస్ట్రిక్ట్‌

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 05, 2025
09:20 am

ఈ వార్తాకథనం ఏంటి

ఏపీ రాజధాని అమరావతిలో నదీ తీర ప్రాంత అభివృద్ధి (రివర్‌ ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌)లో భాగంగా సుమారు 250 ఎకరాల విస్తీర్ణంలో ప్రత్యేకంగా 'కల్చర్ డిస్ట్రిక్ట్' ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇటీవల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో నిర్వహించిన హరిత వనాలు, కాలువలు,తటాకాల అభివృద్ధిపై సమీక్ష సమావేశంలో ఈ ప్రతిపాదన ప్రాథమికంగా చర్చకు వచ్చింది. అమరావతి రాజధాని ప్రణాళికను రూపొందించిన సింగపూర్‌కు చెందిన సుర్బానా-జురాంగ్ సంస్థ ఇప్పటికే కల్చర్ డిస్ట్రిక్ట్‌ను కృష్ణానది ఒడ్డున అభివృద్ధి చేయాలని తమ మాస్టర్‌ప్లాన్‌లో సూచించింది.

వివరాలు 

రూపురేఖలు, ఖచ్చితమైన ప్రణాళికలు త్వరలో..

ఈ ప్రతిపాదనకు మరింత విస్తృత రూపం ఇస్తూ రూపొందించిన వివరాలను అమరావతి అభివృద్ధి సంస్థ (ADC) అధికారులు ముఖ్యమంత్రికి సమర్పించారు. సీఎం ఈ ప్రతిపాదనకు అనుకూలంగా స్పందించినట్టు సమాచారం. పూర్తి స్థాయిలో రూపురేఖలు, ఖచ్చితమైన ప్రణాళికలు త్వరలో సిద్ధం చేయనున్నారు. ఈ కల్చర్ డిస్ట్రిక్ట్‌ను రాష్ట్రపు గొప్ప చరిత్ర, సంపన్న సంస్కృతి, కళా వైభవాన్ని ప్రతిబింబించేలా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తోంది.

వివరాలు 

కల్చర్ డిస్ట్రిక్ట్‌లో నిర్మించబోయే ముఖ్యమైన అంశాలు 

కల్చర్ డిస్ట్రిక్ట్ ప్రణాళికలో భాగంగా ప్రజలకు సాంస్కృతికంగా, సామాజికంగా ఉపయోగపడే పలు నిర్మాణాలు ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడైంది. వాటిలో ప్రధానంగా ఇవే: నదీతీరంలో విశ్రాంతికి అనువైన రివర్ ఘాట్ సాంస్కృతిక ప్రదర్శనలకు అనుకూలంగా కల్చర్ ప్రొమెనేడ్ ఆకర్షణీయమైన పచ్చదనంతో కూడిన లాన్ టెర్రాస్ వినోదానికి అనువైన హై స్ట్రీట్ స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యతనిచ్చే రివర్ మార్కెట్ భారతీయ హస్తకళలను ప్రోత్సహించే క్రాఫ్ట్ విలేజ్ బహుళ ప్రయోజనాలకు అనువైన సాంస్కృతిక కేంద్రం సామూహిక కార్యక్రమాలకు వేదికగా కమ్యూనిటీ ప్లాజా కళా ప్రదర్శనలకు ఉపయోగపడే యాంఫీ థియేటర్ వివిధ సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు వేదికలు క్రీడలకు అనువుగా మల్టీపర్పస్ ప్లేగ్రౌండ్ చిన్నారుల కోసం ప్రత్యేకంగా కిడ్స్ ప్లే ఏరియా

వివరాలు 

అంతర్జాతీయ స్థాయి ఆకర్షణాకేంద్రంగా..

యువతకు ఆకర్షణీయంగా ఉండే రిబ్బన్ వాక్, సెల్ఫీ కార్నర్స్ నదీప్రాంతపు అందాలను వీక్షించేందుకు వ్యూయింగ్ డెక్స్ ఈ సమగ్ర ప్రణాళిక అమలైతే , అమరావతి రాజధాని కేవలం పరిపాలనా కేంద్రంగా కాకుండా సాంస్కృతిక ప్రాధాన్యత కలిగిన అంతర్జాతీయ స్థాయి ఆకర్షణాకేంద్రంగా అభివృద్ధి చెంది, రాష్ట్ర గర్వకారణంగా నిలవనుంది.