Cyclone Midhili: ఏపీకి తప్పిన ముప్పు.. తుపానుగా మారిన తీవ్ర వాయుగుండం
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముప్పు తప్పింది. ఈ మేరకు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుపానుగా మారింది. గంటకు 20 కి.మీ.వేగంతో ఉత్తర వాయవ్య దిశగా కదులుతూ ఒడిశాలోని పరదీప్‌కి 190 కి.మీ దూరంలో తుపాను కేంద్రీకృతమై ఉంది.ఈ క్రమంలోనే తుపానుకు మాల్దీవులు మిథిలి'గా పేరు పెట్టారు. శనివారం ఉదయం బంగ్లాదేశ్‌లోని ఖెపుపారా వద్ద ఈ తుపాను తీరం దాటనుంది.ఆ సమయంలో బంగ్లాదేశ్‌లోని తీరప్రాంతాల్లో గంటకు 80కి.మీ. వేగంతో గాలులు వీయనున్నట్లు ఏపీ అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. ఇదే సమయంలో సముద్రం అల్లకల్లోలంగా మారుతుందని, మత్స్యకారులు వేటను నిషేధించింది.