Bihar: పిల్లల మధ్యాహ్న భోజనంలో చనిపోయిన బల్లి.. పాఠశాలలో గందరగోళం
బిహార్ రాష్ట్రం కిషన్‌గంజ్‌లోని ఒక పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో బల్లి కనిపించడంతో పాఠశాలలో భారీ గందరగోళం ఏర్పడింది. ఈ ఘటనతో విద్యార్థులంతా భయాందోళనకు గురయ్యారు. పిల్లల ఆహారంలో బల్లి కన్పించడం మీద తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారు జిల్లా అధికారులను చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ ఘటనపై పాఠశాల ప్రధానోపాధ్యాయుడు స్పందిస్తూ.. ఇప్పటికే పిల్లల భోజనం నాణ్యతపై తల్లిదండ్రుల పాఠశాల ఉపాధ్యాయులకు ఫిర్యాదులను చేశారని తెలిపారు. బహదుర్‌గంజ్ నగరంలోని పాఠశాలలలో మధ్యాహ్న భోజన పథకం కింద ఆహారం జన జాగృతి ఏజెన్సీ ద్వారా అందించబడుతుంది. అయితే,ఆహారంలో బల్లి కనిపించడం ఆ ఏజెన్సీకి సంబంధించిన నిర్లక్ష్యాన్ని సూచిస్తుంది.గత నెలలో కూడా,కిషన్‌గంజ్‌లోని ఒక పాఠశాలలో ఇలాంటి సంఘటన చోటు చేసుకుంది.
ఘటనపై జిల్లా మేజిస్ట్రేట్ విచారణ చేపట్టాలి.. తల్లితండ్రుల డిమాండ్
తల్లిదండ్రులు జిల్లా మేజిస్ట్రేట్ తుషార్ సింగ్‌గ్లాను విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పాఠశాల ఇన్‌చార్జ్ జాఫర్‌ఆలం తెలిపినట్లుగా, పిల్లల భోజన నాణ్యతపై అనేకసార్లు ఫిర్యాదులు అందాయి.అయినా,ఎన్జీవో ఉద్యోగులు నాణ్యత మెరుగుపరుస్తామని హామీ ఇచ్చినప్పటికీ, పరిస్థితి యధావిథిగానే కొనసాగుతోంది. ఈ రోజు మధ్యాహ్న భోజనంలో బల్లి కనబడటంతో, వెంటనే బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ రేణుకుమారి, స్వచ్ఛంద సంస్థకు సమాచారం అందించారు. అధికారులు విచారణ చేసి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పాఠశాల అధ్యక్షుడు షాబాజ్ అన్వర్ అల్లియాస్ ఛోటే,నగర పంచాయతీ ప్రెసిడెంట్ ప్రతినిధి వశికుర్ రెహమాన్ ఈ పరిస్థితి తీవ్ర నిర్లక్ష్యాన్ని సూచిస్తోందని తెలిపారు. వారు ఆహార సరఫరా ఏజెన్సీపై చర్యలు తీసుకోకపోతే, తాము ఆందోళన చేయనున్నట్లు హెచ్చరించారు.