LOADING...
Deep Fake : 'డీప్‌ఫేక్' చేస్తే డొక్క చించుతాం.. ప్రత్యేక అధికారిని నియమిస్తున్నాం'

Deep Fake : 'డీప్‌ఫేక్' చేస్తే డొక్క చించుతాం.. ప్రత్యేక అధికారిని నియమిస్తున్నాం'

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Nov 24, 2023
02:06 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇటీవలే సామాజిక మాధ్యమాల్లో డీప్‌ఫేక్ తీవ్ర దుమారం రేపుతోంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం స్పందించింది. అటువంటి కంటెంట్‌పై కఠిన చర్యలు తీసుకునేలా అధికారిని నియమిస్తామని చెప్పింది. సోషల్ మీడియాలో డీప్‌ఫేక్ వీడియోల సృష్టిపై కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఫేక్ కంటెంట్‌పై కఠిన చర్యలు తీసుకునేందుకు త్వరలో అధికారిని నియమిస్తామన్నారు. ఈ మేరకు ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (Meity) వెబ్‌సైట్‌ను మరింత ఆధునీకరిస్తామన్నారు. ఇందులో భాగంగా వినియోగదారులు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ఐటీ నిబంధనల ఉల్లంఘనపై తమ ఆందోళనలను నమోదు చేసుకోవచ్చన్నారు. ఐటి నిబంధనల ఉల్లంఘన గురించి వినియోగదారులకు తెలియజేసేందుకు ఎఫ్ఐఆర్ దాఖలు చేయడంలో Meity సహాయం చేస్తుందన్నారు.

DETAILS

ఐటీ నిబంధనలను ఉల్లంఘిస్తే సహించేది లేదని హెచ్చరిక

మధ్యవర్తిపైనా ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తామని, కంటెంట్ ఎక్కడ నుంచి ఉద్భవించిందో వెల్లడిస్తే, కంటెంట్‌ను పోస్ట్ చేసిన వారిపై, సదరు సంస్థపై కేసు నమోదు చేస్తామన్నారు. డీప్‌ఫేక్స్‌పై, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లకు ఐటీ మంత్రి 7 రోజుల పాటు గడువు విధించారు. ఈ క్రమంలోనే సామాజిక మాధ్యమాల్లోని డీప్‌ఫేక్ వీడియోలను తొలగించాలని, ఐటీ నిబంధనల ప్రకారం వినియోగ నిబంధనలను సర్దుబాటుకు సమయమిస్తున్నామన్నారు. ఐటీ నిబంధనలను ఉల్లంఘిస్తే సహించేది లేదని చంద్రశేఖర్ హెచ్చరించారు. గత వారం ప్రధాని నరేంద్ర మోదీ డీప్‌ఫేక్ వీడియోలపై ధ్వజమెత్తారని గుర్తు చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో సాంకేతికతను బాధ్యతాయుతంగా ఉపయోగించడం చాలా ముఖ్యమని స్పష్టం చేశారు.