తదుపరి వార్తా కథనం
Laxma Reddy: బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం.. మాజీ మంత్రి భార్య కన్నుమూత
వ్రాసిన వారు
Jayachandra Akuri
Sep 10, 2024
09:20 am
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ గులాబీ పార్టీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి సతీమణి డాక్టర్ శ్వేత, తీవ్ర అనారోగ్యంతో కన్నుముశారు.
గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో పోరాడుతున్న డాక్టర్ శ్వేత, చికిత్స పొందుతూ సోమవారం రాత్రి ఆస్పత్రిలో మృతి చెందారు.
ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు ధ్రువీకరించారు.
Details
బీఆర్ఎస్ నాయకుల సంతాపం
డాక్టర్ లక్ష్మారెడ్డి హోమియోపతి వైద్యుడు, జడ్చర్ల నియోజకవర్గానికి పలుమార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
కేసీఆర్ కేబినెట్‌లో ఇంధన శాఖ మంత్రిగా, తర్వాత ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా సేవలందించారు.
ఆమె మరణ వార్త తెలుసుకున్న బీఆర్ఎస్ పార్టీ నేతలు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు డాక్టర్ లక్ష్మారెడ్డి కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.