LOADING...
Deepika Padukone: విద్యార్థులు సమస్యను దాచుకుని బాధపడొద్దు .. బయటకు చెప్పండి: 'పరీక్షా పే చర్చ'లో దీపికా పదుకొణె
విద్యార్థులు సమస్యను దాచుకుని బాధపడొద్దు .. బయటకు చెప్పండి: 'పరీక్షా పే చర్చ'లో దీపికా పదుకొణె

Deepika Padukone: విద్యార్థులు సమస్యను దాచుకుని బాధపడొద్దు .. బయటకు చెప్పండి: 'పరీక్షా పే చర్చ'లో దీపికా పదుకొణె

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 11, 2025
03:57 pm

ఈ వార్తాకథనం ఏంటి

స్కూల్లో చదువుకునే రోజుల్లో తాను కూడా అల్లరి పిల్లగానే ఉండేదానని అంటున్నారు బాలీవుడ్‌ నటి దీపికా పదుకొణె. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిఏటా నిర్వహించే 'పరీక్షా పే చర్చ' (Pariksha Pe Charcha) కార్యక్రమాన్ని ఈసారి కొంత వినూత్నంగా నిర్వహించారు. ఇందులో భాగంగా నటి దీపికా పదుకొణె పాల్గొని మానసిక ఆరోగ్యంపై విద్యార్థులకు విలువైన సలహాలు ఇచ్చారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియోను ఆమె ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పంచుకున్నారు.

వివరాలు 

స్కూల్ రోజుల అనుభవాలు 

"నాలో చిన్నప్పటి నుంచి చాలా ఎనర్జీ ఉండేది. స్కూల్లో సోఫాలు, టేబుల్స్‌, కుర్చీలపై ఎక్కి అల్లరి చేసేదాన్ని. విద్యార్థిగా చదువుకునే సమయంలో ఒత్తిడి అనేది సహజమే. ఉదాహరణగా, నాకు లెక్కలంటే చాలా భయం. ఇప్పటికీ ఆ సబ్జెక్ట్‌లో నేను అంత బలంగా లేను. అయితే, ఆ భయాన్ని అధిగమించాలి" అని చెప్పారు. దీపికా ప్రధాని మోదీ రాసిన 'ఎగ్జామ్‌ వారియర్స్‌' పుస్తకాన్ని ప్రస్తావిస్తూ, "ఏదైనా సమస్యను మనలోనే దాచుకోకుండా, కుటుంబ సభ్యులు, స్నేహితులు, టీచర్లతో పంచుకోవాలి. అంతేకాదు, జర్నల్‌ లేదా డైరీ రాయడం అలవాటు చేసుకుంటే, మన భావోద్వేగాలను వ్యక్తీకరించడానికి అది గొప్ప మార్గం" అని సూచించారు.

వివరాలు 

మానసిక ఆరోగ్యంపై అవగాహన 

తాను కూడా ఒక దశలో డిప్రెషన్‌ను ఎదుర్కొన్నట్లు దీపికా పదుకొణె ఈ సందర్భంగా తెలిపారు. అయితే, దానిని ఎలా అధిగమించాలో విద్యార్థులకు వివరించారు. దీపిక తన ఎపిసోడ్‌కు సంబంధించిన ట్రైలర్‌ను పంచుకున్నారు. పూర్తి వీడియోను ఫిబ్రవరి 12న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి అవకాశం కల్పించినందుకు ప్రధాని మోదీకి దీపికా కృతజ్ఞతలు తెలియజేశారు. మానసిక ఆరోగ్యం పై అవగాహన చాలా అవసరమని ఆమె అభిప్రాయపడ్డారు.

వివరాలు 

'పరీక్షా పే చర్చ'లో ఇతర ప్రముఖుల భాగస్వామ్యం 

ఈ ఏడాది 'పరీక్షా పే చర్చ' కార్యక్రమం దిల్లీలోని సుందరవనంలో నిర్వహించారు. ప్రధాని మోదీ విద్యార్థులతో మాట్లాడి, "పరీక్షలను జీవితంలో అంతా అవుతోందని భావించకూడదు. తల్లిదండ్రులు తమ పిల్లలను ఇతరులతో పోల్చడం మానుకోవాలి. వారిని ఇతరుల ముందు మోడల్స్‌గా నిలిపేందుకు ప్రయత్నించకూడదు" అని సూచించారు. ఈ కార్యక్రమంలో దీపికా పదుకొణెతో పాటు.. ప్రసిద్ధ బాక్సర్‌ మేరీ కోమ్,ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్,యూట్యూబర్‌ & టెక్నికల్‌ గురు రాధికా గుప్తా, వంటి వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొని విద్యార్థులతో తమ అనుభవాలను పంచుకున్నారు. ఈ ప్రత్యేకమైన చర్చలో జరిగిన పాడ్‌కాస్ట్‌ ఎపిసోడ్స్‌ను త్వరలోనే విడుదల చేయనున్నారు.