Delhi: ఢిల్లీ బీజేపీ చీఫ్ కీలక నిర్ణయం.. పోటీకి దూరంగా వీరేంద్ర సచ్‌దేవా!
ఈ వార్తాకథనం ఏంటి
దేశ రాజధాని ఢిల్లీలో ఎన్నికల సందడి మొదలైంది. హస్తినలో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించేందుకు సన్నాహాలు చేస్తోంది.
ఈ క్రమంలో అధికార పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ముందస్తుగా అభ్యర్థుల జాబితాను విడుదల చేసి, ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేసింది.
కొత్త పథకాలను ప్రకటిస్తూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది.
ఈ నేపథ్యంలో, బీజేపీ కూడా ఎన్నికల సమరానికి సిద్దమవుతుందని తెలుస్తోంది.
శుక్రవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలో గృహ నిర్మాణ ప్రాజెక్టును ప్రారంభించి, మురికివాడ ప్రజలకు ఇళ్లు పంపిణీ చేశారు. ఇది బీజేపీ ఎన్నికల ప్రచారానికి ప్రారంభమని భావిస్తున్నారు.
వివరాలు
ఒక్క లోక్‌సభ సీటును కూడా గెలవని ఆప్
ఇక, ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్‌దేవా అసెంబ్లీ ఎన్నికల పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
బీజేపీ తొలి అభ్యర్థుల జాబితా సిద్ధమవుతుండగా, వీరేంద్ర సచ్‌దేవా తన అభిప్రాయాన్ని హైకమాండ్‌కు తెలియజేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఫిబ్రవరి నాటికి ఢిల్లీ ప్రస్తుత ప్రభుత్వ గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో, త్వరలోనే ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి.
2015 నుంచి ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉంది.
అయితే, 2014 నుంచి ఇప్పటివరకు ఆప్ ఒక్క లోక్‌సభ సీటును కూడా గెలుచుకోలేకపోయింది.
మొత్తం ఏడు లోక్‌సభ స్థానాలను బీజేపీ గెలుచుకుంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్, బీజేపీ మధ్య తీవ్రమైన పోరు జరగనుందని అంచనా.
వివరాలు
కేజ్రీవాల్ లక్ష్యంగా బీజేపీ పోస్టర్ యుద్ధం
ఇప్పటికే బీజేపీ అరవింద్ కేజ్రీవాల్‌ను లక్ష్యంగా చేసుకుని పోస్టర్ యుద్ధం మొదలుపెట్టింది.
కేజ్రీవాల్‌ను "చాలా రిచ్" అంటూ పోస్టర్లు విడుదల చేయడమేగాక, ఆప్ అధికారంలో కొనసాగేందుకు ఓటర్లను మోసం చేస్తోందని ఆరోపించింది.
జనవరి 1న, బీజేపీ చీఫ్ దేవేంద్ర కేజ్రీవాల్‌కు లేఖ రాస్తూ, అబద్ధాలు, మోసం చేయడం వంటి అలవాట్లను విడిచిపెట్టాలని సూచించారు.
మద్యం ప్రోత్సహించినందుకు ఢిల్లీ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
బీజేపీ, ఆప్ మధ్య పరస్పర ఆరోపణలు జరుగుతున్నాయి. ఆప్ ఓటర్లను తొలగించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించగా, ఆప్ సానుభూతిపరుల ఓట్లు తొలగించేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని కేజ్రీవాల్ ధ్వజమెత్తారు.
ఈ ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధిస్తుందో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.