
Rekha Gupta: 50 రోజులైనా ఢిల్లీ ముఖ్యమంత్రికి దక్కని అధికార నివాసం
ఈ వార్తాకథనం ఏంటి
దిల్లీ ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన రేఖా గుప్తా ఇప్పటికే 50 రోజులు పూర్తి చేసుకున్నారు.కానీ ఇంతవరకూ ఆమెకు అధికారిక నివాసం కేటాయించలేదు.
ఈ కారణంగా, ఆమె తన నివాసమైన షాలిమార్ బాగ్ నుంచే అధికార కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు.
ప్రతిరోజూ సుమారు 25 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించి సచివాలయానికి వెళ్లాల్సి వస్తోంది.
ఇక గతంలో అరవింద్ కేజ్రీవాల్ నివసించిన బంగ్లాలోకి ప్రవేశించేందుకు ఆమె ఆసక్తి చూపడం లేదు.
ఇందుకు కారణం, ఎన్నికల సమయంలో అది శీష్‌మహల్ (Sheesh Mahal) అంటూ విమర్శలు గుప్పించడమే అందుకు కారణంగా తెలుస్తోంది.
వివరాలు
ఖాళీగా ఉన్న అధికార నివాసాలపై పరిశీలన
అధికారులు ప్రస్తుతం ఖాళీగా ఉన్న అధికార నివాసాలపై పరిశీలన చేస్తున్నప్పటికీ, రేఖా గుప్తాకు సంబంధించి అధికారికంగా ఏదైనా ఇంటిని కేటాయించే విషయమై ఇంకా స్పష్టత రావడంలేదు.
ప్రభుత్వ ప్రజాపనుల విభాగం ఈ విషయంలో సరైన పరిష్కారాన్ని కనుగొనలేకపోతోంది.
ప్రస్తుతం ఆమె దిల్లీ లేదా కేంద్ర ప్రభుత్వం ద్వారా ఓ అధికారిక నివాసాన్ని పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం.
అయితే, ఈ ప్రక్రియలో ఆలస్యం కావడం వల్ల ఆమె అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది.
షాలిమార్ బాగ్‌లో ఆమె నివసిస్తున్న ఇంటిలో స్థలం తక్కువగా ఉండటంతో, అక్కడకు వచ్చేవారు — సందర్శకులు, వీఐపీలు, ఉన్నతాధికారులు.. అసౌకర్యానికి గురవుతున్నారు.
వివరాలు
సివిల్ లైన్స్ లేదా లుటియెన్స్ ప్రాంతాలలో రేఖా గుప్తా అధికారిక నివాసం
రేఖా గుప్తా అధికారిక నివాసంగా సివిల్ లైన్స్ లేదా లుటియెన్స్ ప్రాంతాలను ఎంచుకునే అవకాశమున్నట్లు సమాచారం.
ముఖ్యంగా లుటియెన్స్ ప్రాంతం అధికారులతో సమావేశాలు నిర్వహించడానికి సౌకర్యంగా ఉంటుందని భావిస్తున్నారు.
అయితే అక్కడ నివాసం కోసం కేంద్ర ప్రభుత్వ సంస్థల అనుమతి అవసరం, ముఖ్యంగా సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ అనుమతే కీలకం.
ఇదే కారణంగా నివాస కేటాయింపులో ఆలస్యం జరుగుతోంది. దిల్లీ ప్రజాపనుల శాఖ ఇప్పటికే స్పీకర్, మంత్రులు, ప్రతిపక్ష నాయకులకు అధికారిక నివాసాలు కేటాయించింది.
వివరాలు
బంగ్లాను "శీష్ మహల్"గా అభివర్ణణ
గతంలో, ఆమ్ ఆద్మీ పార్టీ నేషనల్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పుడు, సివిల్ లైన్స్‌లోని 6 ఫ్లాగ్‌స్టాఫ్ రోడ్‌లోని బంగ్లాను అధికారిక నివాసంగా ఉపయోగించేవారు.
అయితే భాజపా ఈ బంగ్లాను "శీష్ మహల్"గా అభివర్ణించింది. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి, ఆ ఇంటిని 7-స్టార్ రిసార్ట్‌లా మార్చుకున్నారని ఆక్షేపించింది.
ఆ బంగ్లా, ఆప్ మోసాలకు ప్రతీకగా నిలుస్తుందని పేర్కొంటూ, ఈ ఆరోపణలను ప్రజల్లో బలంగా విస్తరించింది.
ఈ అవినీతి విమర్శలు ఆప్ ప్రభుత్వాన్ని అసెంబ్లీ ఎన్నికల్లో తీవ్రంగా దెబ్బతీశాయని విశ్లేషకులు భావిస్తున్నారు.