Air Pollution : దిల్లీలో మోగుతున్న డేంజర్ బెల్స్.. నేడు బంగ్లా, శ్రీలంక మ్యాచ్
భారతదేశం రాజధాని దిల్లీలో వాయు కాలుష్యం డేంజర్ లెవెల్స్ దాటనున్నాయి. ఈ మేరకు జాతీయ రాజధాని పరిధిలో హై అలెర్ట్ నెలకొంది. మరోవైపు మధ్యాహ్నం 2 గంటల నుంచి బంగ్లాదేశ్ - శ్రీలంక మధ్య ప్రపంచకప్-2023 మ్యాచ్ జరగనుంది. ఈ క్రమంలోనే కమీషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ (CAQM) గాలి నాణ్యత మరింత క్షీణించకుండా నిరోధించేందుకు 1, 2, 3 దశల కింద అన్ని చర్యలలు తీసుకున్నారు. ప్రస్తుతం తక్షణ దిద్దుబాటు చర్యగా దిల్లీ-NCR అంతటా GRAP స్టేజ్ 4ని అమలు చేస్తున్నారు. గాలి నాణ్యత సూచిక (AQI) 450-500కి చేరుకున్నసందర్భంలో గ్రాప్ 4వ దశని ప్రవేశపెడుతుంటారు. ఆదివారం దిల్లీలోని పలు ప్రాంతాల్లో ఏక్యూఐ 450 దాటింది.
అమల్లోకి వచ్చిన గ్రాప్
స్టేజ్ 4 కోసం 8-పాయింట్ యాక్షన్ ప్లాన్ GRAP స్టేజ్ 4కి అనుగుణంగా ఎనిమిది పాయింట్ల కార్యాచరణ ప్రణాళిక ఆదివారం నాటికి NCR అంతటా అమలులో ఉంది. ప్రణాళిక ప్రకారం, అవసరమైన వస్తువులు, రవాణా చేసే ట్రక్కులు, అన్ని ఎల్‌ఎన్‌జి, సిఎన్‌జి, ఎలక్ట్రిక్ ట్రక్కులను మినహాయించి, దిల్లీలో ట్రక్కుల ప్రవేశం పరిమితం చేస్తారు. GRAP అంటే ఏమిటి GRAP, లేదా గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ అనేది దిల్లీ-NCR ప్రాంతంలో గాలి నాణ్యత మరింత క్షీణించడాన్ని ఆపేందుకు నిర్దిష్ట ప్రక్రియ. ఇది తీవ్రమైన పోల్యూషన్ సందర్భంలో అమలులోకి వచ్చే అత్యవసర చర్యల శ్రేణి. GRAPను తొలిసారిగా 2017లో పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ద్వారా అమలు జరిగింది.