Delhi Air Pollution: దిల్లీని కప్పేసిన దట్టమైన పొగమంచు.. పలు విమానాల దారి మళ్లింపు
దేశ రాజధాని దిల్లీని బుధవారం అత్యంత దట్టమైన పొగమంచు చుట్టుముట్టింది.దీని వలన సమీప దృశ్యాలు కూడా పూర్తిగా కనబడటం లేదు (జీరో విజిబిలిటీ). ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో రన్‌వేపై కేవలం 125 మీటర్ల దూరం వరకే కనబడుతుండటంతో,విమానాల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఈ కారణంగా పది విమానాలను జైపూర్,లఖ్నో విమానాశ్రయాలకు మళ్లించినట్లు అధికారులు తెలిపారు. మరికొన్ని విమానాలు ఆలస్యంగా వెళ్ళినట్లు కూడా పేర్కొన్నారు. అదనంగా,ఢిల్లీలో 15వ రోజు వాయు నాణ్యత(ఏక్యూఐ)నిరంతరం తగ్గుతూ 366 పాయింట్లకు చేరుకుంది. ఇదే పరిస్థితి హర్యానా,పంజాబ్‌లలోనూ ఉంది.హర్యానాలోని పానీపత్‌లో ఏక్యూఐ 336కు చేరగా, పంజాబ్‌లోని మండీ గోబింద్‌గఢ్‌లో 308ఏక్యూఐ నమోదైంది. వాయు నాణ్యత మరింత క్షీణిస్తుండటంతో,ఐదో తరగతి వరకు పాఠశాలలను మూసివేయాలని ఢిల్లీ ప్రభుత్వాన్నిబీజేపీ డిమాండ్ చేసింది.