Page Loader
న్యూస్ క్లిక్ ఎడిటర్, హెచ్‌ఆర్ హెడ్ అరెస్ట్‌..పిటిషన్‌ను విచారించనున్న ఢిల్లీ హైకోర్టు 
న్యూస్ క్లిక్ ఎడిటర్, హెచ్‌ఆర్ హెడ్ అరెస్ట్‌..పిటిషన్‌ను విచారించనున్న ఢిల్లీ హైకోర్టు

న్యూస్ క్లిక్ ఎడిటర్, హెచ్‌ఆర్ హెడ్ అరెస్ట్‌..పిటిషన్‌ను విచారించనున్న ఢిల్లీ హైకోర్టు 

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 06, 2023
02:06 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఉగ్రవాద నిరోధక చట్టం యూఏపీఏ కింద నమోదైన కేసులో న్యూస్‌ క్లిక్ వ్యవస్థాపకుడు ప్రబీర్ పుర్కాయస్థ, మానవ వనరుల విభాగం అధిపతి అమిత్ చక్రవర్తి అరెస్ట్‌కు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌పై శుక్రవారం విచారణకు దిల్లీ హైకోర్టు అంగీకరించింది. ప్రధాన న్యాయమూర్తి సతీష్ చంద్ర శర్మ నేతృత్వంలోని ధర్మాసనం ముందు ఈ అంశాన్ని సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ అత్యవసర విచారణ కోసం ప్రస్తావించారు. కేంద్ర ప్రభుత్వంపై బూటకపు కథనాన్ని ప్రచారం చేసేందుకు చైనా నుంచి న్యూస్‌ క్లిక్‌కు నిధులు సమకూర్చిన ఆరోపణలపై తీవ్రవాద నిరోధక చట్టం UAPA కింద నమోదైన కేసులో పుర్కాయస్థ,చక్రవర్తి మంగళవారం అరెస్టయ్యారు.

Details 

జర్నలిస్టులు,న్యూస్‌క్లిక్‌ కంట్రిబ్యూటర్‌లను విచారించిన పోలీసులు 

దేశ రాజధాని ఢిల్లీలోని న్యూస్‌క్లిక్ కార్యాలయానికి ఢిల్లీ పోలీసులు సీల్ వేశారు. 2016లో సుప్రీం కోర్టు ఆదేశాలను, 2010లో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఉటంకిస్తూ ఎఫ్‌ఐఆర్ కాపీని ఇద్దరికీ అందించాలని గురువారం ఇక్కడి ట్రయల్ కోర్టు నగర పోలీసులను ఆదేశించింది. అదే రోజు, ఈ కేసుకు సంబంధించి ఢిల్లీ పోలీసులు జర్నలిస్టులు ఊర్మిళేష్, అభిసార్ శర్మలను ఈ వారంలో రెండోసారి ప్రశ్నించారు. అంతకుముందు మంగళవారం, ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న అనుమానితులపై ఢిల్లీలోని 88,ఇతర రాష్ట్రాల్లో ఏడు ప్రదేశాలలో దాడులు నిర్వహించబడ్డాయని డేటా విశ్లేషణలో బయటపడింది. మొత్తం 46 మంది జర్నలిస్టులు,న్యూస్‌క్లిక్‌ కంట్రిబ్యూటర్‌లను విచారించారు. వారి మొబైల్ ఫోన్‌లు,ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లను స్వాధీనం చేసుకున్నారు.