Page Loader
Delhi: స్పైడర్ మ్యాన్‌ను అరెస్టు చేసిన పోలీసులు
స్పైడర్ మ్యాన్‌ను అరెస్టు చేసిన పోలీసులు

Delhi: స్పైడర్ మ్యాన్‌ను అరెస్టు చేసిన పోలీసులు

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 24, 2024
05:49 pm

ఈ వార్తాకథనం ఏంటి

ట్రాఫిక్ నిబంధలను ఉల్లంఘించినందుకు స్పైడర్ మ్యాన్ వేషంలో ఉన్నవ్యక్తిని దిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ద్వారకా రహాదారిపై ట్రాఫిక్ నిబంధనలను పాటించకపోవడంతో పోలీసులు అరెస్టు చేసినట్లు తెలిసింది. నజాఫ్‌గఢ్‌కు చెందిన 20 ఏళ్ల ఆదిత్య అనే వ్యక్తి కారు బానెట్‌పై కూర్చొని పోలీసులకు పట్టుబడ్డాడు. ఈ ఘటనపై సోషల్ మీడియా ద్వారా వచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు చర్యలు తీసుకున్నారు.

Details

నిందితుడికి రూ.26వేలు జరిమానా

ఆదిత్య, కారు డ్రైవర్ సింగ్‌ ను పోలీసులు అదుపులోకి తీసుకొని చలానా విధించారు. ప్రమాదకరమైన డ్రైవింగ్, పొల్యూషన్ సర్టిఫికేట్ లేకుండా డ్రైవింగ్ చేయడం, సీటుబెల్ట్ ధరించకపోవడం వంటి వాటిపై కేసు నమోదు చేశారు. నిందితుడు గరిష్టంగా రూ.26వేలు జరిమానా, లేదా జైలు శిక్ష లేదా విధించే అవకాశం ఉంది.