Delhi weather: గ్రాప్-4 నిబంధనలు.. ఆందోళనకర స్థాయికి ఢిల్లీలో వాయు కాలుష్యం
ఢిల్లీలో వాయు కాలుష్యం మళ్లీ తీవ్ర స్థాయికి చేరింది. గాలి కాలుష్యం కారణంగా ప్రజలు కళ్లలో మంటలు, ఊపిరాడక ఇబ్బందులు అనుభవిస్తున్నారు. సోమవారం రోజున ఢిల్లీ నగరంలోని కొన్ని ప్రాంతాల్లో గాలి నాణ్యత సూచిక 450కి పైగా నమోదైంది. బవానాలో అత్యధిక ఏక్యూఐ స్థాయి 475 వరకు చేరుకుంది, ఇది అత్యంత తీవ్రమైన విభాగంలో వస్తుంది. డిసెంబర్ 16 నుంచి ఢిల్లీలో గ్రాప్-4 నిబంధనలు అమలులో ఉండటున్నప్పటికీ, గాలి నాణ్యతలో ఎలాంటి మెరుగుదల కనిపించటం లేదు. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో గాలి నాణ్యత సూచిక 400 దాటింది. సోమవారం ఉదయం 6 గంటల సమయానికి ఢిల్లీలోని 25 కాలుష్య పర్యవేక్షణ కేంద్రాల్లో గాలి నాణ్యత సూచిక 400 కంటే ఎక్కువగా నమోదైంది.
నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ఏక్యూఐ స్థాయిలు 450ని దాటాయి
ఈ నేపథ్యంలో, గ్రాప్-4 నిబంధనల ప్రకారం, ఢిల్లీలోని నిర్మాణ పనులను పూర్తిగా నిలిపివేయగా, పాఠశాలలు కూడా హైబ్రిడ్ విధానంలో కొనసాగుతున్నాయి. ఇదిలా ఉండగా,ఢిల్లీ నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ఏక్యూఐ స్థాయిలు 450ని దాటాయి. బవానాలో 475,రోహిణిలో 468,వజీర్‌పూర్‌లో 464,అశోక్ విహార్‌లో 460,సోనియా విహార్‌లో 456, జహంగీర్‌పురిలో 453 వద్ద నమోదయ్యాయి. ఈ పరిస్థితి ఢిల్లీవాసులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది.వాతావరణశాఖ,సోమవారం రోజున ఢిల్లీలో వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. దీనితో పాటు,ఢిల్లీలో చలి కూడా తీవ్రమైంది. సోమవారం ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రత 8 డిగ్రీల సెల్సియస్, గరిష్ట ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్సియస్‌గా ఉండవచ్చని వాతావరణ శాఖ పేర్కొంది. అదేవిధంగా,మరి రెండు రోజులపాటు ఢిల్లీలో దట్టమైన పొగమంచు కొనసాగే అవకాశం ఉందని వెల్లడించింది.