Page Loader
Pawan Kalyan: అలిపిరి నుంచి నడక మార్గంలో తిరుమలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
అలిపిరి నుంచి నడక మార్గంలో తిరుమలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

Pawan Kalyan: అలిపిరి నుంచి నడక మార్గంలో తిరుమలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 01, 2024
05:27 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రాయశ్చిత్త దీక్షను విరమించేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తిరుమలకు బయల్దేరారు. ఆయన అలిపిరి పాదాల మండపంలో పూజలు చేసిన అనంతరం కాలినడకన తిరుమలకు పయనమయ్యారు. పవన్ కల్యాణ్ రాకతో కూటమి నేతలు, జనసేన కార్యకర్తలు భారీగా తరలివచ్చారు, దీంతో పోలీసులు పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. బుధవారం ఉదయం పవన్ కల్యాణ్ శ్రీవారిని దర్శించుకుని తన ప్రాయశ్చిత్త దీక్షను విరమించనున్నారు. ఈ సందర్బంగా ఆయన అన్న ప్రసాద కేంద్రాన్ని కూడా పరిశీలించనున్నారు.

Details

3వ తేదిన ఆలయాల్లో భజన కార్యక్రమాలు

పవన్ కళ్యాణ్దీ క్ష విరమణ నేపథ్యంలో 30వ తేదీన రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో దీపాలు వెలిగించనున్నట్లు తెలిపారు. అక్టోబర్ 1న 'ఓం నమో నారాయణాయ' మంత్రాన్ని ఆలయాలు, యోగ కేంద్రాల్లో పఠించాలని జనసేన అధిష్ఠానం పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చింది. 2వ తేదీన నగర సంకీర్తన, 3వ తేదీన ఆలయాల్లో భజన కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.