Page Loader
Sabarmati Express: పట్టాలు తప్పిన సబర్మతి ఎక్స్‌ప్రెస్.. ఏడు రైళ్లు రద్దు
పట్టాలు తప్పిన సబర్మతి ఎక్స్‌ప్రెస్.. ఏడు రైళ్లు రద్దు

Sabarmati Express: పట్టాలు తప్పిన సబర్మతి ఎక్స్‌ప్రెస్.. ఏడు రైళ్లు రద్దు

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 17, 2024
08:57 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశంలో మరో రైలు ప్రమాదం చోటు చేసుకుంది. యూపీలోని కాన్పూర్ స్టేషన్‌కి సమీపంలో సబర్మతి ఎక్స్‌ప్రెస్ ప్యాసింజర్ ట్రైన్ పట్టాలు తప్పింది. ఈ ఘటనలో దాదాపు 20 బోగీలు ట్రాక్ నుంచి బయటికొచ్చాయి.అయితే అదృష్టవశాత్తు ప్రాణనష్టం జరగలేదు. రైలు పట్టాలు తప్పడం వల్ల ఏడు రైళ్లను రద్దు చేశామని రైల్వే అధికారులు వెల్లడించారు. పట్టాలపై బండరాయి కారణంగానే ప్రమాదం జరిగినట్లు అధికారులు గుర్తించారు.

Details

ప్రాణనష్టం జరగలేదు

ఈ ప్రమాదంలో రైలు ఇంజిన్ ముందు భాగం దెబ్బతిందని, అయితే ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నట్లు రైల్వే అధికారులు ధ్రువీకరించారు. ఇక ప్రమాదం జరిగిన ప్రదేశం నుంచి కాన్పుర్ రైల్వే స్టేషన్ ప్రయాణికులను తీసుకెళ్లేందుకు బస్సులను ఏర్పాటు చేశామని నార్త్ సెంట్రల్ రైల్వే జోన్ చీఫ్ పబ్లిక్ రిలేషన్ అధికారి శశి కాంత్ త్రిపాఠి పేర్కొన్నారు. రైలు ప్రయాణికులను తరలించడానికి కాన్పూర్ ణుంచి ప్రమాద స్థలానికి ఎనిమిది కోచ్‌ల ఎంఈఎంయూ రైలు బయలుదేరిందన్నారు.