Bangalore: లా అండ్ ఆర్డర్ వల్ల కర్ణాటక నుండి కంపెనీలు దూరం : నిర్మలా సీతారామన్
అధిక ద్రవ్యోల్బణం, అధ్వాన్నంగా ఉన్న లా అండ్ ఆర్డర్ వల్ల కర్ణాటక నుండి కంపెనీలను దూరమవుతున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం అన్నారు. ఆదివారం బెంగళూరులో అమె విలేకర్లతో మాట్లాడారు. కర్నాటకు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించడం లేదని రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నఆరోపణలు అవాస్తమన్నారు. యూపీఏ పదేళ్ల పాలనలో రూ.81,791 కోట్లతో పోల్చితే గత పదేళ్లలో కేంద్ర ప్రభుత్వం రూ.2,95,818 కోట్లు ఇచ్చిందని అమె గుర్తు చేశారు.
రెవెన్యూ లోటు ఎక్కువగా ఉంది
కర్ణాటకలో రెవెన్యూ లోటు చాలా ఎక్కువగా ఉందని, మూలధన వ్యయం జరగడం లేదని, మూలధన వ్యయం ఖర్చు చేస్తే తప్ప డిమాండ్ ఉండదని ఆమె చెప్పింది. రెండేళ్ల క్రితం కర్ణాటక రెవెన్యూ మిగుల్లో ఉండేదని, లా అండ్ ఆర్డర్ క్షీణించడంతో ఎన్నో కంపెనీలు బయటికి వెళ్లిపోతున్నాయన్నారు. కర్నాటకు కేంద్రం, నిధులు కేటాయించలేదని ప్రభుత్వం ప్రజలను తప్పుదారి పట్టించేలా వ్యవహరిస్తోందన్నారు.