LOADING...
DGCA: ఎయిర్ ఇండియాకు సంబంధించిన దాదాపు 100 ఉల్లంఘనలు: డిజిసిఎ  
ఎయిర్ ఇండియాకు సంబంధించిన దాదాపు 100 ఉల్లంఘనలు: డిజిసిఎ

DGCA: ఎయిర్ ఇండియాకు సంబంధించిన దాదాపు 100 ఉల్లంఘనలు: డిజిసిఎ  

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 30, 2025
10:46 am

ఈ వార్తాకథనం ఏంటి

అహ్మదాబాద్‌లో ఇటీవల జరిగిన ఘోర విమాన ప్రమాదం తర్వాత ప్రముఖ విమానయాన సంస్థ ఎయిరిండియా తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటోంది. ఈ ఘటనను కొనసాగింపుగా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్‌ (DGCA) సంస్థపై దర్యాప్తు జరిపి కీలక విషయాలను వెలికితీసింది. డీజీసీఏ ప్రకారం, ఎయిరిండియాలో మొత్తం 100 ఉల్లంఘనలు గుర్తించబడినట్టు వెల్లడించింది. అందులో 7 ఉల్లంఘనలు అత్యంత ప్రాధాన్యత కలిగిన 'లెవెల్-1' కేటగిరీలోకి వస్తాయని పేర్కొంది. ఈ ఉల్లంఘనల వలన తీవ్రమైన ప్రమాదం సంభవించవచ్చని అంచనా వేసి, వెంటనే వాటికి సరైన పరిష్కారాలను తీసుకోవాలని సంస్థను హెచ్చరించింది. అలాగే, ఎయిర్ ఇండియా తన విమాన సేవలను సురక్షితంగా నిర్వహించేందుకు తక్షణ దిద్దుబాట్లు చేయాలని ఆదేశించింది.

వివరాలు 

 'లెవెల్-1' ఉల్లంఘనగా నమోదు 

ఈ దిశగా ఎయిరిండియా తీసుకున్న చర్యలపై సమగ్ర నివేదికను జూలై 30వ తేదీలోపు సమర్పించాలని డీజీసీఏ స్పష్టం చేసింది. అంతేకాక,ఇతరంగా గుర్తించిన 44 ఉల్లంఘనలను వచ్చే ఆగస్టు 23వ తేదీకి లోగా పరిష్కరించాలని సూచించింది. ఈ క్రమంలో బోయింగ్ 787,777 విమానాలకు సంబంధించిన పైలట్లకు తాజా మార్పుల ప్రకారం తగిన శిక్షణ ఇవ్వడం లేదని డీజీసీఏ గుర్తించింది. ఇటీవల ఎయిరిండియాలో సంభవించిన అత్యంత తీవ్రమైన ఘటనల్లో మిలన్ నుంచి ఢిల్లీకి వెళ్ళాల్సిన బోయింగ్ 787 విమానం 2 గంటల 18 నిమిషాలు ఆలస్యంగా రన్న్‌ చేశారు. ఇది 'లెవెల్-1' ఉల్లంఘనగా నమోదు అయిందని స్పష్టం చేసింది.అదనంగా, సీ కేటగిరీలోకి వచ్చే విమానాశ్రయాల విషయంలో సరైన రూట్ అస్సెస్మెంట్లు నిర్వహించడంలో ఎయిరిండియా విఫలమైందని వివరించింది.

వివరాలు 

ఇంధన స్విచ్‌ల లాకింగ్ వ్యవస్థల తనిఖీలకు సంబంధించి ఆదేశాలు జారీ

భద్రతాపరంగా మరిన్ని లోపాలను కూడా డీజీసీఏ గుర్తించింది.వాటిలో విమాన తలుపులు,పరికరాల తనిఖీల్లో ఏర్పడిన అసమానతలు,శిక్షణ సంబంధిత డాక్యుమెంటేషన్‌లో ఖాళీలు,అలాగే ఎయిరిండియా ఎయిర్‌బస్ A320,A350 విమానాలకు చీఫ్ పైలట్లు లేనటువంటి అంశాలు ఉన్నాయి. అహ్మదాబాద్‌ ఘటన అనంతరం డీజీసీఏ దేశవ్యాప్తంగా ఉన్న బోయింగ్ 787,737 విమానాల్లో ఇంధన స్విచ్‌ల లాకింగ్ వ్యవస్థల తనిఖీలకు సంబంధించి ఆదేశాలు జారీ చేసింది. ఇంతటితో ఆగకుండా,సంస్థలో ఉన్న వ్యవస్థాపకలోపాలను హైలైట్ చేస్తూ,డీజీసీఏ నాలుగుషోకాజ్ నోటీసులు ఎయిరిండియాకు పంపింది. ఇప్పటికే 2022జనవరిలో ఎయిరిండియాను కేంద్ర ప్రభుత్వం నుంచి టాటా గ్రూప్ తిరిగి స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి,సంస్థ నిరంతరంగా వివిధ సవాళ్లను ఎదుర్కొంటోంది. ఎయిరిండియా విమానాలు తరచూ ఆలస్యంగా నడుస్తున్నాయన్నవీ,సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయన్నవీ ప్రయాణికుల నుంచి బహుళ ఫిర్యాదులుగా వస్తున్నట్టు సమాచారం.